ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు.. గట్టిగా క్లారిటీ ఇచ్చేసిన జంట..!
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకుల వార్తలకు చెక్ పెడుతూ మరోసారి కలిసి కనిపించారు. నవంబర్ 5న ముంబైలో మనీశ్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి వేడుకలకు ఈ జంట చేతిలో చేయి వేసుకుని హాజరైంది. ఒకరినొకరు ప్రేమగా చూస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఐశ్వర్య ఎరుపు చీరలో, అభిషేక్ నల్లటి షేర్వానీలో ఆకట్టుకున్నారు. వారి ఫొటోలు వైరల్‌గా మారాయి.
By: Priya Chowdhary Nuthalapti | 7 Nov 2026 7:40 AM ISTబాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ చాలా కాలం తర్వాత అభిమానులను సంతోషపరిచారు. గత కొన్నేళ్లుగా ఈ జంట వైవాహిక జీవితంపై ఎన్నో రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో, బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ వార్తలు అభిమానులను కూడా బాధపెట్టాయి.
గతంలో కొన్ని సందర్భాల్లో అభిషేక్, ఐశ్వర్య కలిసి కనిపించినప్పటికీ.. కొన్ని ఫంక్షన్స్ లో వేరువేరుగా కనిపివ్వడం, మరికొన్ని ఫంక్షన్స్ లో అంత ప్రేమగా కనిపియ్యక పోవడం కూడా రూమర్లకు దారితీసింది. దీంతో వీరిద్దరి గురించి రకరకాల ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ జంట మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తమపై వస్తున్న పుకార్లకు గట్టిగా సమాధానం చెబుతూ ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని ఒకే కార్యక్రమానికి హాజరయ్యారు.
నవంబర్ 5న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ముంబైలోని తన నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరి కంటే ఎక్కువగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ వేడుకకు వచ్చిన సమయంలో అభిషేక్, ఐశ్వర్య ఒకరి చేయి మరొకరు పట్టుకుని నడుస్తూ కనిపించారు. అంతేకాదు, ఫొటోలకు పోజులిచ్చే సమయంలో ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. దీంతో అక్కడి కెమెరాలన్నీ ఈ జంటపైనే ఫోకస్ చేశాయి. ఈ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ వేడుకలో ఐశ్వర్య ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా కనిపించారు. చీరకు ఉన్న గోల్డెన్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఆమె అందాన్ని మరింత పెంచింది. మరోవైపు అభిషేక్ నల్లటి షేర్వానీలో హుందాగా కనిపించారు.
