Begin typing your search above and press return to search.

ఆ న‌టికి నేరుగా ఇంటికొచ్చే ప్ర‌పోజ్ చేసారా!

మాలీవుడ్ న‌టి అభిరామి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మూడు ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్నారు

By:  Srikanth Kontham   |   30 Dec 2025 1:00 PM IST
ఆ న‌టికి నేరుగా ఇంటికొచ్చే ప్ర‌పోజ్ చేసారా!
X

మాలీవుడ్ న‌టి అభిరామి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మూడు ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్నారు. హీరోయిన్, క్యారెక్ట‌ర్ ఆరిస్ట్ ..కీల‌క పాత్రల్లో సైతం న‌టిస్తూ ప్రేక్షకుల్ని అల‌రిస్తున్నారు. టాలీవుడ్ లోనూ అభిరామి ఎంతో ఫేమ‌స్. `థాంక్యూ సుబ్బారావ్`, `ఛార్మినార్`, `చెప్ప‌వే చిరుగాలి`, `లెవ‌న్`, `12 ఏ రైల్వే కాల‌నీ`, `స‌రిపోదా శ‌నివారం` లాంటి చిత్రాల్లో న‌టించారు. వీట‌న్నింటిని ప‌క్క‌న బెడితే ఓ సినిమాలో విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో లిప్ లాక్ స‌న్ని వేశంలో న‌టించి పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యారు. ఆ ఒక్క లిప్ లాక్ తో నెట్టింట సంచ‌ల‌నంగా మారారు.

అదే ఇమేజ్ తో ఎన్నో కొత్త అవ‌కాశాలు అందుకుంటున్నారు. ఏ భాష‌లో అవకాశం వ‌చ్చినా నో చెప్ప‌కుండా ప‌ని చేస్తున్నారు. ఇక అభిరామి వ్య‌క్తిగ‌త జీవితంలోకి వస్తే ప్రేమించిన స్నేహితుడినే 14 ఏళ్ల క్రిత‌మే పెళ్లి చేసుకున్నారు. భ‌ర్త పేరు రాహుల్. ఇత‌డు ఓ రైట‌ర్ కి మ‌న‌వ‌డు అవుతాడు. చిన్న నాటి స్నేహితుడు కావ‌డం..అటుపై ఇద్ద‌రు అమెరికాలో పై చ‌దువుల‌తో వారి స్నేహం ప్రేమ‌గా మారి వివాహానికి దారి తీసింది. అయితే వివాహానికి ముందు అభిరామికి స్కూల్ డేస్ లోనే ఎన్నో ప్రేమ లేఖ‌లు..ల‌వ్ ప్రపోజ‌ల్స్ చూసిన‌ట్లు గుర్తు చేసుకున్నారు.

అభిరామి త‌ల్లిదండ్రులిద్ద‌రు బ్యాక్ ఉద్యోగులు కావ‌డంతో? కుమార్తె స్కూల్ కి వెళ్ల‌డానికి ఇబ్బంది కాకూడ‌ద‌ని ఆ ప‌క్క‌నే ఇల్లు తీసుకుని ఉండేవారు. అభిరామి అందానికి స్కూల్ డేస్ లోనే చాలా మంది ఫిదా అయ్యార‌ని ఎన్నో ప్రేమ లేఖ‌లు వ‌చ్చాయన్నారు. కొంత మందైతే? నేరుగా ఇంటికొచ్చి మ‌రీ ప్ర‌పోజ్ చేసా రన్నారు. కానీ ఎవ‌రి ప్రేమ‌ను అప్ప‌ట్లో అంగీక‌రించ‌లేదన్నారు. ఈ విష‌యంలో చిన్న వ‌య‌సులో త‌ల్లిదండ్రులు చెప్పిన‌ మాట‌లు ఎంతో ప‌ని చేసాయన్నారు. తెలిసి తెలియ‌ని వ‌య‌సులో చేసే ప‌నులు గురించి త‌ల్లిదండ్రులు ఎప్ప‌టిక‌ప్పుడు క్లాస్ లు తీసుకునే వార‌ని..దీంతో త‌న‌లో ఆ వ‌య‌సులోనే ఎంతో అవేర్ నెస్ వ‌చ్చింద‌న్నారు.

ఎదిగే పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రుల పాత్ర ఎంతో కీల‌క‌మైని..మంచి చెడులు ద‌గ్గ‌రుండి చెబితే? ఎన్నో ర‌కాల స‌మ‌స్యల నుంచి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు. నేటి జ‌న‌రేషన్ యువ‌త అన్ని రంగాల్లో ఎంతో ముందుం టుంద‌న్నారు. విజ‌యాల‌తో పాటు కొన్ని ర‌కాల స‌మ‌స్య‌లు కూడా స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో తెచ్చుకుంటున్నార‌ని అభిప్రాయ ప‌డ్డారు. అభిరామి ఈ రెండేళ్ల కాలంలోనే 15 సినిమాల్లో న‌టించ‌డం కెరీర్ లోనే హాయ్యెస్ట్ గా చెప్పొచ్చు.