మా సినిమాకు రక్షకులు అవసరం లేదు!
ప్రస్తుతం మాలీవుడ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పరిమిత బడ్జెట్‌లతో, వైవిథ్యమైన కథాంశాలతో ప్రాంతీయ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది.
By: Srikanth Kontham | 5 Jun 2026 1:42 PM ISTప్రస్తుతం మాలీవుడ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పరిమిత బడ్జెట్‌లతో, వైవిథ్యమైన కథాంశాలతో ప్రాంతీయ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమను ఉద్దేశించి దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మాలీవుడ్‌ను ఇప్పట్లో ఏ శక్తీ రక్షించాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే అత్యంత సురక్షితమైన.. బలమైన స్థితిలో ఉందనేది అభి ప్రాయంగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఏ సినీ పరిశ్రమ అయినా? మనుగడ సాగించాలంటే అగ్ర తారల ఇమేజ్, మాస్ ఎలిమెంట్స్ మాత్రమే దిక్కు అనే భావన ఉండేది. కానీ మలయాళ సినిమా ఈ పాత ఫార్ములాలను పూర్తిగా తిరగరాసింది.
అక్కడ స్టార్ పవర్ కంటే కథా బలమే సినిమాను నడిపిస్తోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కొత్త నటీనటులతో సైతం వందల కోట్ల వసూళ్లను సాధించొచ్చని మాలీవుడ్ నిరూపించిందన్నారు. ఈ స్వయంసమృద్ధి వల్లనే పరిశ్రమకు బయట నుంచి గానీ కృత్రిమ హైప్ గానీ అవసరం లేదన్నారు. మలయాళ చిత్రాల ప్రధాన బలం వాటిలోని సహజత్వం .. ప్రయోగాత్మకత. కమర్షియల్ హంగుల కోసం కథను పక్కన పెట్టకుండా? నిత్య జీవితంలో జరిగే సంఘటనలను..సంబంధాలను ఎంతో లోతుగా ఆవిష్కరిస్తున్నారు. సైకో థ్రిల్లర్ల నుండి ఫీల్ గుడ్ డ్రామాల వరకు ప్రతి జోనర్‌లోనూ సరికొత్త ప్రయోగాలు చేయడం సర్వసాధారణంగా మారింది.
దర్శకులకు లభిస్తోన్న సృజనాత్మక స్వేచ్ఛ .. నిర్మాతలు చూపిస్తోన్న ధైర్యం మాలీవుడ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం మలయాళ సినిమాలు కేరళకే పరిమితం కాకుండా పాన్-ఇండియా వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో సైతం మాలీవుడ్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తమ సంస్కృతిని, మూలాలను వదులుకోకుండానే అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో సినిమాలను తెరకెక్కించడం ప్రత్యేకతగతా మారింది. ఇతర పరిశ్రమలు భారీ బడ్జెట్లతో కొట్టుమి ట్టాడుతుంటే? మాలీవుడ్ మాత్రం తక్కువ వ్యయంతో భారీ లాభాలను అందుకుని ఆదర్శంగా నిలుస్తోంది.
పరిశ్రమలో అంతర్గతంగా కొన్ని సవాళ్లు, వివాదాలు ఉన్నప్పటికీ సృజనాత్మకత విషయంలో మాత్రం మాలీవుడ్ వెనక్కి తగ్గలేదు. అభినవ్ సుందర్ నాయక్ లాంటి నూతన తరం దర్శకులు ఇండస్ట్రీలోని లోపాలను ఎత్తి చూపుతూనే సినిమా మేకింగ్ శైలిని ప్రశంసిస్తున్నారు. బాహ్య ప్రపంచం మాలీవుడ్‌ను ఓ సంక్షోభంలో ఉన్నట్లుగా చూడాల్సిన పనిలేదని.. ప్రస్తుత విజయాల పరంపర పరిశ్రమ అసలు సత్తాను చాటోతోందని బలంగా నమ్ముతున్నారు. మలయాళ సినిమా సాధిస్తున్న ఘన విజయాలు మిగిలిన భారతీయ చలనచిత్ర పరిశ్రమలకు గొప్ప పాఠంగా చెప్పొచ్చు. భారీ తారాగణం, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ మాత్రమే సినిమాను రక్షించలేవని ప్రేక్షకుల హృదయాలను తాకే కథలు మాత్రమే పరిశ్రమను నిలబెడతాయని మాలీవుడ్ చాటి చెబుతుంది.
