ఆ విషయంలో స్టార్ హీరోని దూరం పెట్టాను: దర్శకుడు కశ్యప్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ విభేధాల గురించి తెలిసిందే.
By: Sivaji Kontham | 24 Oct 2025 9:15 AM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ విభేధాల గురించి తెలిసిందే. తనను, తన సోదరుడిని సల్మాన్, అతడి కుటుంబీకులు నాశనం చేసారని కశ్యప్ బహిరంగంగా తిట్టాడు. తన కెరీర్ ని నాశనం చేసాడంటూ, సల్మాన్ ని అనరాని మాటలు అన్నాడు. సల్మాన్ తనను అదుపాజ్ఞల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించాడని, దబాంగ్ 2 కి దర్శకత్వం వహించాలని తనను వెంబడించాడని అతడు అన్నాడు.
ఇప్పుడు అతడు ఖాన్ ల త్రయంలోని కీలక వ్యక్తి షారూఖ్ వైఖరి గురించి కూడా మాట్లాడాడు. షారూఖ్ కేవలం తీసుకుంటాడు... సమాజానికి ఇచ్చేదేమీ ఉండదు.. అతడు దుబాయ్ లో సెటిలవ్వాలనుకున్నాడు! అని తెలిపాడు. షారూఖ్ కుటుంబంపై గౌరవం ఉండటం వల్ల తాను అన్నిటినీ మాట్లాడటం లేదని అన్నాడు. షారూఖ్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలున్నాయి. అతడి వ్యక్తిగత జీవితం గురించి నాకు చాలా తెలుసు.. కానీ అతని కుటుంబం విడిపోవడానికి నేను కారణం కాకూడదని కోరుకుంటున్నాను కాబట్టి దానిని చెప్పను. అతడు ఒక ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి అతడిని అలాగే ఉండనివ్వండి... అని అన్నాడు.
ఈ వ్యవస్థ ఆలోచనా విధానం ఎలా ఉంది అంటే.. హీరోలు ఏమని ప్రచారం చేసారో అదే నిజం.. ఒక హీరోతో సినిమా తీసాక.. అది ఫ్లాపైతే దర్శకుడి కారణంగానే ఫ్లాపయినట్టు.. ఇది జిహాదీ మనస్తత్వం.. దీనిని కూల్చి వేయాలి...! అని అన్నాడు. తాను షారుఖ్‌తో క్లోజ్ గా మాట్లాడతాను.. అమీర్‌తో కలిసి పనిచేశానని కూడా అతడు ఒప్పుకున్నాడు.
ముగ్గురూ ఆలోచించే విధానం ఒకేలా ఉంటుంది. సల్మాన్ ఒక పోకిరి.. అతడు తిడతాడు. షారుఖ్ అలా చేయడు. షారుఖ్ ఆలోచనా విధానం ఎవరి ఐడియాని అయినా తీసుకోవడం.. నాతో రెడ్ చిల్లీస్‌లో సినిమా తీయాలని భావించాడు. కానీ నేను తీయలేదు. తన బ్యానర్ లో సినిమా అయితే దానిని అతడు నియంత్రించగలడు. కానీ ఇప్పుడు కుదురదు. షారూఖ్ కేవలం నటుడిగా ఉండాలని, పారితోషికం తీసుకోవాలని, సైలెంట్ గా అతడు తన పాత్రలో నటించాలని కోరుకున్నట్టు తెలిపాడు. షారూఖ్ సల్మాన్ లా కాదు. కనీసం అతడు మొరటుగా ఉండడు... తప్పుడు విధానంలో ఉండడు! అని అన్నాడు.
