Begin typing your search above and press return to search.

దొంగ.. క‌ళంకితుడు.. మ‌రుగుజ్జు ప‌రిపూర్ణుడు ఎలా అవుతాడు? అమీర్ ఖాన్‌పై డైరెక్ట‌ర్ ఎటాక్!

ఇప్పుడు అమీర్ ఖాన్ వంతు. అమీర్ ఖాన్ ఒక దొంగ‌.. క‌ళంకితుడు.. మరుగుజ్జు హీరో.. అత‌డు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ (ప‌రిపూర్ణుడు) ఎలా అవుతాడు? అని నిలదీసే ప్ర‌య‌త్నం చేసాడు అభిన‌వ్.

By:  Sivaji Kontham   |   25 Oct 2025 11:00 PM IST
దొంగ.. క‌ళంకితుడు.. మ‌రుగుజ్జు ప‌రిపూర్ణుడు ఎలా అవుతాడు? అమీర్ ఖాన్‌పై డైరెక్ట‌ర్ ఎటాక్!
X

స‌ల్మాన్ ఖాన్‌పై కొద్దికాలంగా `దబాంగ్` ద‌ర్శ‌కుడు అభిన‌వ్ క‌శ్య‌ప్ తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ కి న‌టించ‌డం రాద‌ని, అత‌డు మాఫియాను ర‌న్ చేస్తాడని, త‌న‌ కెరీర్ నాశ‌నం చేసాడ‌ని విమ‌ర్శించాడు. ఆ త‌ర్వాత షారూక్ ఖాన్ పైనా అత‌డి దాడి ఆగ‌లేదు. ఖాన్ తెలివైన వారిని ఉప‌యోగించుకుంటాడ‌ని అన్నాడు. అత‌డి వ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని విమ‌ర్శించాడు.

ఇప్పుడు అమీర్ ఖాన్ వంతు. అమీర్ ఖాన్ ఒక దొంగ‌.. క‌ళంకితుడు.. మరుగుజ్జు హీరో.. అత‌డు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ (ప‌రిపూర్ణుడు) ఎలా అవుతాడు? అని నిలదీసే ప్ర‌య‌త్నం చేసాడు అభిన‌వ్. అమీర్ ఖాన్ కి కూడా న‌టించ‌డం రాద‌ని అభిన‌వ్ విమ‌ర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అంతేకాదు అమీర్ ఖాన్ ఎత్తు గురించి వ్యాఖ్యానిస్తూ, అత‌డు ఒక మ‌రుగుజ్జు అని విమ‌ర్శించాడు. అలాంటి వ్య‌క్తిని ప‌రిపూర్ణ‌తావాది అని ఎలా పిలుస్తారు? అని విమ‌ర్శించాడు అభిన‌వ్ క‌శ్య‌ప్. బాలీవుడ్ తికాణా ఇంట‌ర్వ్యూలో అత‌డు చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర‌ దుమారం రేపుతున్నాయి.

షూటింగ్ స‌మ‌యంలో అమీర్ ఖాన్ అన‌వ‌స‌ర‌ ఇన్వాల్వ్ మెంట్ గురించి అత‌డు ఘాటైన విమ‌ర్శ‌లు చేసారు. అమీర్ తో రెండు మూడు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల కోసం ప‌ని చేసాను. అతడికి ఎలా నటించాలో తెలియదు..అతడితో పనిచేయడం అంటే అల‌సిపోవ‌డమే... సెట్లో ద‌ర్శ‌కుల‌ను నిర్వీర్యం చేస్తాడు.. అతడు ప్రతిదానిలోనూ జోక్యం చేసుకుంటాడు. ఎడిటింగ్, దర్శకత్వం ప్రతిదానిలోనూ వేలు పెడ‌తాడు.. అని విమ‌ర్శించాడు. 25 టేక్ లు తిన్నాక కూడా ఇది ఎక్కువ అది ఎక్కువ అంటూ విసిగిస్తాడ‌ని అన్నాడు. బాలీవుడ్‌లో నటులు దర్శకులపై ఆధిపత్యం చెలాయించే, తారుమారు చేసే సంస్కృతిని అమీర్ ఖాన్ ప్రారంభించాడని అభినవ్ దుయ్య‌బ‌ట్టారు.

రాజ్ కుమార్ హిరాణీ, ఓం ప్ర‌కాష్ మెహ్రా వంటి ప్ర‌ముఖులు అత‌డి కోసం క‌థ‌లు రెడీ చేసి క‌లుస్తూ ఉంటారు. అమీర్ ట్రాప్‌లో వీరంతా ఇరుక్కుపోయారు. ఈ ప్ర‌తిభావంతులు ఇత‌ర హీరోల‌తో ప‌ని చేయ‌డం కోసం సొంత బ్యాన‌ర్లు స్థాపించాల‌ని కూడా సూచించాడు. హిరాణీ, ఓం ప్ర‌కాష్ మెహ్రా వంటి ప్ర‌తిభావంతులంటే త‌న‌కు అపార‌మైన గౌర‌వం ఉంద‌ని కూడా అభిన‌వ్ క‌శ్య‌ప్ అన్నారు. కానీ వీరంతా అమీర్ ఖాన్ ఇంట్లో క‌లుస్తుంటారు. ``ఈ మరుగుజ్జులో ఉన్న‌ది.. ఇతరుల‌లో లేనిది ఏమిటి?`` అంటూ అమీర్ ఎత్తుపై ఘాటైన కామెంట్ చేసాడు. ఆ హీరోలంతా బాగా సంపాదిస్తారు.. కానీ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో అమీర్ ఏం సాయం చేసాడు? దంగ‌ల్ చైనా నుంచి 2000 కోట్లు వ‌సూలు చేసింద‌ని అత‌డు చెప్పాడు. వీళ్లంతా బాగా సంపాదించినా ఎవ‌రికీ ఉప‌యోగం ఉండ‌దు అని అన్నాడు.

`దంగల్` సినిమా కథకు ప్రేరణ ఇచ్చిన మహావీర్ ఫోగ‌త్ పిల్లలకు శిక్షణ కోసం హర్యానాలో ఒక అకాడెమీ తెరవమని అభ్యర్థించ‌గా, ఆమిర్ ఖాన్ నిరాకరించాడని వార్తలు వచ్చాయి. అకాడెమీ తెరవడానికి ఎంత ఖర్చవుతుంది? ఆ డబ్బు అంతా మహావీర్ ఫోగట్ కథ వ‌ల్ల‌నే సంపాదించాడు. అత‌డు కేవ‌లం హ‌క్కుల కోసం చెల్లించాడు త‌ప్ప మాన‌వ‌త‌తో కాదు! అని విమ‌ర్శించాడు. గ‌త కొద్దిరోజులుగా అభిన‌వ్ ఖాన్‌ల త్ర‌యాన్ని టార్గెట్ చేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. అత‌డు త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌ను య‌థేచ్ఛ‌గా బ‌హిర్గ‌తం చేస్తున్నాడు.