ఆస్తులు..అంతస్తులు చూసి చెల్లి పెళ్లి చేయలేదు!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్- ఆయుశ్ శర్మ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 13 April 2026 9:29 AM ISTబాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్- ఆయుశ్ శర్మ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు. ప్రస్తుతం వారి ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది. తాజాగా ఈ పెళ్లి వెనుక అనేక సంగతులున్నాయని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్పితా ఖాన్‌ను వివాహం చేసుకోవాలనే తన నిర్ణయం విన్నప్పుడు ఆయుశ్ తల్లిదండ్రులు ఎంతలా షాక్‌కు గురయ్యారో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయుష్ శర్మ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడు.
అప్పట్లో తను ఇంకా కెరీర్ పట్ల ఒక స్పష్టత లేకుండా ఉన్నాడు. దీంతో కుమారుడు తీసుకున్న పెద్ద నిర్ణయం ఆయుశ్ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పటికి ఆయుష్ ఇంకా సినిమాల్లోకి ప్రవేశించలేదు. ఎలాంటి ఉద్యోగం కూడా చేయడం లేదు. అప్పుడు ఆయుశ్ తండ్రి `నువ్వు ఇంకా సంపాదించడం మొదలు పెట్టలేదు. మరి ఆమెను ఎలా పోషిస్తాడు? అని తండ్రి ప్రశ్నించినట్లు ఆయుష్ గుర్తు చేసుకున్నాడు.
అర్పితా ఖాన్ కుటుంబ నేపథ్యం గురించి తెలిసి ఆ తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెరిగింది. సల్మాన్ ఖాన్ సోదరిగా అర్పితా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిందని అటువంటి వ్యక్తి తమ సాధారణ కుటుంబంలో ఎలా ఇమడగలదు అనేది వారి ప్రధాన సందేహంగా మారింది. ఖాన్ కుటుంబం పట్ల ఉన్న గౌరవం ఒకవైపు ఉన్నా? పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య అంతస్తుల బేధం సమస్యగా మారకూడదని తన తల్లిదండ్రులు భావించారని ఆయుష్ వెల్లడించాడు. సల్మాన్ ఖాన్‌ను మొదటిసారి కలిసినప్పుడు కలిగిన ఉత్కంఠను కూడా ఆయుష్ వివరించాడు.
అర్పితాను ప్రేమిస్తున్న విషయం సల్మాన్ ఖాన్‌కు చెప్పినప్పుడు ఆయన ఎంతో హుందాగా స్పందించారని ఆయుష్ తెలిపాడు . సల్మాన్ తనను ఎప్పుడూ ఒక సోదరుడిలాగే ఆదరించారని తన కెరీర్ పట్ల ఎప్పుడూ ప్రోత్సాహాన్ని అందిం మచారని కొనియాడారు. ఖాన్ కుటుంబం చూపిన ప్రేమ , ఆదరణ వల్లే తన తల్లిదండ్రుల్లో భయాలు కూడా మెల్లగా తొలగిపోయాయని ఆయుశ్ శర్మ తెలిపాడు. సల్మాన్ పెళ్లి విషయంలో వారి మధ్య ప్రేమను చూసాడు తప్ప ఆస్తులు , అంతస్తులు కాదు. ఒక మనిషిని మనిషిగా గౌరవించడం ఆయనలో గొప్ప లక్షణంగా పేర్కొన్నారు. ఆస్తులు, అంతస్తులకు సల్మాన్ పెద్ద ప్రాధాన్యత ఇవ్వరని..చాలా సింపుల్ గా ఉండటం అంటేనే ఇష్టమన్నారు.
