Begin typing your search above and press return to search.

సినిమా ఒక్కటే.. రిజల్ట్ వేరుగా.. అప్పుడు నచ్చనిది ఇప్పుడెలా..?

కొన్ని సినిమాలు ఒకసారికే అర్థం కావు.. రిపీటెడ్ గా చూస్తుంటే సినిమాలో విషయం అర్ధమవుతుంది.

By:  Ramesh Boddu   |   26 Oct 2025 10:14 AM IST
సినిమా ఒక్కటే.. రిజల్ట్ వేరుగా.. అప్పుడు నచ్చనిది ఇప్పుడెలా..?
X

కొన్ని సినిమాలు ఒకసారికే అర్థం కావు.. రిపీటెడ్ గా చూస్తుంటే సినిమాలో విషయం అర్ధమవుతుంది. ఐతే ఒకసారి చూడటానికే ఇంట్రెస్ట్ చూపించని వాళ్లు రెండు మూడు సార్లు చూసే ఛాన్స్ అసలు లేదు. ఐతే ఒక భాషలో తీసిన ఒక సినిమాను ఆ భాషలో ఆడియన్స్ పట్టించుకోకపోతే ఆ సినిమాను జస్ట్ డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ ప్రేక్షకులు సక్సెస్ చేస్తే కచ్చితంగా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. అలాంటి ఒక సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి డిస్కషన్ పాయింట్ గా మారింది.

సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన యుగానికి ఒక్కడు..

ఇంతకీ ఏ సినిమా గురించి ఈ లీడ్ అంతా అనుకుంటున్నారు కదా అదే ఆయిరత్తిల్ ఒరువన్. 2010లో సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తి, రీమాన్ సేన్, ఆండ్రియా లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమాను తెలుగులో యుగానికి ఒక్కడుగా రిలీజ్ చేశారు. ఐతే ఆ టైం లో తమిళ్ ఆడియన్స్ ఆ సినిమాను లైట్ తీసుకుంటే తెలుగు ఆడియన్స్ మాత్రం సినిమాను సక్సెస్ చేశారు. అంతేకాదు ఆ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ వైరల్ చేస్తుంటారు. కార్తి చెప్పే ఎవర్రా మీరంతా డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటుంది.

తెలుగులో సక్సెస్ అయ్యింది కాబట్టి కోవిడ్ లాక్ డౌన్ టైంలో తమిళ్ లో ఆ సినిమా రీ రిలీజ్ చేస్తే అప్పుడు ఆ సినిమా చూసి తమిళ్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఐతే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ సెల్వ రాఘవన్ సినిమా వచ్చినప్పుడు ఆదరించకుండా రీ రిలీజ్ టైం లో ఎంజాయ్ చేయడం ఎందుకని అన్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ సినిమా సీక్వెల్ ప్రస్తావన రాగా ఆ సీక్వెల్ ప్రకటించకుండా ఉండాల్సింది.

సీక్వెల్ లో ధనుష్ నటిస్తారని ప్రచారం..

యుగానికి ఒక్కడు సీక్వెల్ కార్తి లేకుండా చేయలేం. కానీ హీరో డేట్స్ ఏడాది పాటు కావాలి దానితో పాటు ఇప్పుడున్న టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఆ సినిమా తీయాలి. ఐతే దానికి ఇంకాస్త టైం పట్టేలా ఉందని అన్నారు సెల్వ రాఘవన్. ఐతే సెల్వ రాఘవన్ ఆయిరత్తిల్ ఒరువన్ సీక్వెల్ ప్రకటించి చాలాకాలం అయ్యింది. ఈ సీక్వెల్ లో ధనుష్ నటిస్తారని ప్రచారం జరిగింది.

ఆయిరత్తిల్ ఒరువన్ అదే యుగానికి ఒక్కడు సీక్వెల్ గురించి సెల్వ రాఘవన్ ఏం థింక్ చేస్తున్నారో తెలియదు కానీ ఆ సీక్వెల్ వస్తే ఈసారి తెలుగులోనే కాదు తమిళ్ ఆడియన్స్ కూడా గ్రాండ్ గా రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. యుగానికి ఒక్కడు 2 లో కార్తి, ధనుష్ ఇద్దరు కలిసి నటిస్తే ప్రేక్షకులకు ఫీస్ట్ అన్నట్టే లెక్క.