Begin typing your search above and press return to search.

ఈసారైనా 'ఆవేశ‌'ప‌డతారా?

ఒక భాష‌లో సూప‌ర్ హిట్ అయిన క‌థ మ‌రో భాష‌లో కొత్త స్టార్ ఇమేజ్ తో, స‌రికొత్త ట్రీట్‌మెంట్ తో వస్తే చూడాల‌ని ఆడియ‌న్స్ కు ఇప్ప‌టికీ ఆతృత‌గానే ఉంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 Feb 2026 9:00 PM IST
ఈసారైనా ఆవేశ‌ప‌డతారా?
X

ట్రెండ్ మారుతున్నా, సినీ ఇండ‌స్ట్రీలో రీమేక్ సినిమాల‌పై ఆడియ‌న్స్ కు ఇంట్రెస్ట్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఒక భాష‌లో సూప‌ర్ హిట్ అయిన క‌థ మ‌రో భాష‌లో కొత్త స్టార్ ఇమేజ్ తో, స‌రికొత్త ట్రీట్‌మెంట్ తో వస్తే చూడాల‌ని ఆడియ‌న్స్ కు ఇప్ప‌టికీ ఆతృత‌గానే ఉంది. ముఖ్యంగా మ‌ల‌యాళ‌, త‌మిళ ఇండ‌స్ట్రీల నుంచి వ‌చ్చే కంటెంట్ కు తెలుగులో మొద‌టి నుంచి కూడా మంచి డిమాండ్ ఉంది.

కేర‌ళ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆవేశం

అందులో భాగంగా మ‌ల‌యాళ స్టార్ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాసిల్ న‌టించిన ఆవేశం సినిమా రీమేక్ పై కూడా తెలుగు ఆడియ‌న్స్ కు మంచి ఆస‌క్తి నెల‌కొంది. ఆవేశం మూవీ ఫ‌హ‌ద్ కెరీర్లో కీల‌క మైల్ స్టోన్ ఫిల్మ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కేర‌ళ బాక్సాఫీస్ ను ఈ సినిమా షేక్ చేసింది. కంటెంట్, పెర్ఫార్మెన్స్, స్టైల్.. ఇవ‌న్నీ ఆవేశం మూవీని భారీ సెన్సేష‌న్ గా నిలిపాయి.

ఆవేశం తెలుగు రీమేక్ వార్త‌లు

ఈ మూవీలో ఫ‌హ‌ద్ క్యారెక్ట‌ర్ కు యూత్ తో పాటూ మాస్ ఆడియ‌న్స్ కూడా విప‌రీతంగా ఎట్రాక్ట్ అయ్యారు. ఇలాంటి సినిమా తెలుగులోకి రీమేక్ అయితే చూడాల‌ని తెలుగు ఆడియ‌న్స్ కూడా చాలా ఎదురుచూశారు. కేర‌ళ‌లో భారీ సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ తెలుగులో రీమేక్ అవుతుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు కూడా బాగా గ‌ట్టిగానే వినిపించాయి.

ప‌ట్టాలెక్క‌ని ఆవేశం తెలుగు రీమేక్

ఆవేశం సినిమా తెలుగులోకి రీమేక్ అవ‌నుంద‌ని, గాడ్ ఆఫ్ మాసెస్ నంద‌మూరి బాల‌కృష్ణ లేదా మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ రీమేక్ తెర‌కెక్క‌నుంద‌ని అంద‌రూ అనడంతో ఆవేశం రీమేక్ పై ఉన్న ఆస‌క్తి ఇంకా పెరిగిపోయింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఆవేశం తెలుగు రీమేక్ ప‌ట్టాలెక్కింది లేదు. దీంతో ఆవేశం సినిమాను తెలుగులో ఎక్స్‌పీరియెన్స్ చేయ‌లేక‌పోయారు తెలుగు ఆడియ‌న్స్.

ఆవేశం2ను నిర్ధారించిన ఫ‌హ‌ద్

కాగా తాజాగా ఫ‌హ‌ద్ ఫాసిల్ ఆవేశం సినిమాకు సీక్వెల్ గా ఆవేశం2 రానుంద‌ని చెప్ప‌డంతో ఇప్పుడు మ‌రోసారి ఈ మూవీ తెలుగు రీమేక్ తెర‌పైకి వ‌చ్చింది. ఆల్రెడీ సూప‌ర్ హిట్ గా నిలిచిన ఆవేశం మూవీకి రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న మొద‌టి నుంచే ఉండ‌టంతో ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా వ‌స్తున్న నేప‌థ్యంలో తెలుగు రీమేక్ విష‌యంలో మేక‌ర్స్ ఏమైనా తొంద‌ర‌ప‌డ‌తారేమో చూడాలి. ఆవేశం2 సెట్స్ పైకి వెళ్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు తెలుగు రీమేక్ వ‌స్తే ఈ మూవీకి హైప్ కూడా బాగా ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఆవేశం సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆవేశం2కు మంచి డిమాండ్ ఏర్ప‌డనుంది. ఈ సినిమాను డైరెక్ట్ గా తెలుగులోకి ఫ‌హ‌ద్ తోనే రీమేక్ లేదా డ‌బ్బింగ్ చేసినా నిర్మాత‌ల‌కు అది క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఎలాగూ ఫ‌హ‌ద్ కు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. కాబ‌ట్టి ఆవేశం సినిమాను ముందుగా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసి, ఆ త‌ర్వాత ఆవేశం2ను కూడా తెలుగులోకి డ‌బ్ చేయ‌డం మంచి ఆప్ష‌న్ గా క‌నిపిస్తోంది.