Begin typing your search above and press return to search.

హైపర్‌లింక్ స్క్రీన్‌ప్లేతో 'ఆస్మాన్'.. డైరెక్టర్ రామ్

రియల్ స్టార్ శ్రీహరి జయంతి రోజున ఆయన కుమారుడు మేఘాంశ్ లేటెస్ట్ మూవీ 'ఆస్మాన్' ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత వెంకటేష్, డైరెక్టర్ రామ్ నందన్ సినిమా మీద తమకున్న కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టారు.

By:  M Prashanth   |   16 Aug 2026 9:40 AM IST
హైపర్‌లింక్ స్క్రీన్‌ప్లేతో ఆస్మాన్.. డైరెక్టర్ రామ్
X

రియల్ స్టార్ శ్రీహరి జయంతి రోజున ఆయన కుమారుడు మేఘాంశ్ లేటెస్ట్ మూవీ 'ఆస్మాన్' ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత వెంకటేష్, డైరెక్టర్ రామ్ నందన్ సినిమా మీద తమకున్న కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టారు. ముఖ్యంగా సినిమా స్టోరీ లైన్, మేఘాంశ్ డెడికేషన్ గురించి వాళ్లు చెప్పిన విషయాలు ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉన్నాయి.

సినిమా ఏ స్టేజ్‌లో ఉందనేది నిర్మాత వెంకటేష్ క్లియర్ చేశాడు. ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని, ఇంకో రెండు మూడు నెలల్లో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని చెప్పారు. పోస్టర్‌లో ఉన్న కటౌట్ చూస్తుంటే లక్ష వోల్టుల కరెంటు పాస్ అయిన ఫీలింగ్ వస్తోందని, రేపు థియేటర్లలో కూడా ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ రావడం పక్కా అని గట్టి నమ్మకంతో ఉన్నాడు.

ప్రతిరోజూ అందరికంటే ముందే సెట్‌కు వచ్చేవాడని, అసలు ఎలాంటి ఇగో లేకుండా సింపుల్‌గా ఉండేవాడని మెచ్చుకున్నారు. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా, పక్కా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. కేవలం 15 రోజుల్లోనే డేట్స్ ఇచ్చి సినిమా ఫాస్ట్‌గా స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేసిన శాంతి శ్రీహరికి థాంక్స్ చెప్పారు.

ఇక డైరెక్టర్ రామ్ నందన్ ఈ సినిమా స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ లీక్ చేశాడు. పక్కా హైపర్‌లింక్ స్క్రీన్‌ప్లేతో ఈ కథ నడుస్తుందని క్లారిటీ ఇచ్చాడు. తాను ఐమ్యాక్స్‌లో సినిమాలు చూసే రేంజ్ నుంచి, ఇప్పుడు జనాలకు ఐమ్యాక్స్ లెవల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే స్థాయికి వచ్చానని ఎమోషనల్ అయ్యాడు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ స్క్రీన్ షేక్ అయ్యేలా ఉంటాయని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

మేఘాంశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అవ్వబోతోందట. ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని కెమెరా ముందుకు వస్తే మేఘాంశ్ ఒక మిస్సైల్ లా కనిపించాడని డైరెక్టర్ అన్నాడు. ఫస్ట్ లుక్‌తో అసలు కథలో ఉన్న మిస్టరీ మొదలైందని, రిలీజ్ టైమ్ వరకు ఇలాంటి థ్రిల్లింగ్ అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటామని హింట్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ షోయబ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. రాయంచ హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ ఇస్తున్నాడు. పాన్ ఇండియా రిలీజ్ అంటే ఐదు భాషల్లో ప్లాన్ చేస్తారు. కానీ ఆస్మాన్ టీమ్ సౌత్ భాషలతో పాటు ఏకంగా అరబిక్‌లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండటం హైలెట్.