కొత్త గెటప్ లో ఆషికా రంగనాథ్!
ఆషికా రంగనాథ్.. ఈ హీరోయిన్ తెలుగులో చేసినవి 2 సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ మాదిరి గుర్తింపు సంపాదించింది.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన తాజా ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
By: Madhu Reddy | 30 Oct 2025 3:14 PM ISTఆషికా రంగనాథ్.. ఈ హీరోయిన్ తెలుగులో చేసినవి 2 సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ మాదిరి గుర్తింపు సంపాదించింది.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన తాజా ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.ఎప్పుడు పొట్టి పొట్టి బట్టలతోనో లేక ట్రెడిషనల్ డ్రెస్ లతోనో కనిపించే ఆషికా రంగనాథ్ ఒక్కసారిగా గెటప్ చేంజ్ చేసేసరికి ఈ హీరోయిన్ ఫొటోస్ చూసిన అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.ఇదేంటి ఈ హీరోయిన్ గెటప్ మార్చేసింది.. ఈ కొత్త గెటప్ ఏంటో అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక తాజాగా ఆషికా రంగనాథ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.ఆ ఫొటోస్ లో ఆషికా రంగనాథ్ గెటప్ పూర్తిగా చేంజ్ అయింది. హాలీవుడ్లో పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే సినిమాలో హీరో ఎలా అయితే ఉంటారో అచ్చం ఆ హీరోని పోలి ఉన్న గెటప్ లో ఆషికా రంగనాథ్ తాజా ఫోటోలు ఉన్నాయి. తలకి బ్యాండ్ కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకొని ఆషికా రంగనాథ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే మాత్రం ఆషికా రంగనాథ్ ఏదో స్టంటులు చేసేవారు ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా ఉంది. అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆషికా రంగనాథ్ పోస్ట్ చేసిన ఫోటోలలో వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఏదో యాక్షన్ మూవీ సెట్ వేసినట్టు కనిపిస్తోంది. చూస్తుంటే ఆషికా రంగనాథ్ కొత్త సినిమా కోసం అలా తన గెటప్ ని చేంజ్ చేసినట్టు కనిపిస్తోంది. మరి ఆషికా రంగనాథ్ తాజా ఫొటోస్ కొత్త సినిమా గెటప్ లో భాగమేనా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ ఫొటోస్ షేర్ చేయడంతో పాటు ఈ ఫొటోస్ కి క్యాప్షన్ గా ఈ మొత్తం లుక్ వెనక ఉన్న బృందానికి లవ్ యు అన్నట్లుగా ఫింగర్ హాట్ సింబల్ ఎమోజిని కూడా షేర్ చేసింది.. ప్రస్తుతం ఆషికా రంగనాథ్ కి సంబంధించిన తాజా ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.మరి హీరోయిన్ సడెన్ గా గెటప్ చేంజ్ వెనుక కారణం ఏంటో తెలియాల్సి ఉంది.
ఆషికా రంగనాథ్ సినిమాల విషయానికి వస్తే.. క్రేజీ బాయ్ అనే మూవీ తో కన్నడ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్ ఆ తర్వాత పలు కన్నడ సినిమాల్లో నటించి పట్టదు అరసు అనే తమిళ మూవీలో కూడా నటించింది.
ఆషికా రంగనాథ్ మొదటి తెలుగు సినిమా అమిగోస్..కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ సినిమా ద్వారానే ఆషికా రంగనాథ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగ మూవీలో హీరోయిన్ గా అవకాశం అందుకొని ఈ సినిమాతో పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ లో కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.. ఆషికా రంగనాథ్ అప్ కమింగ్ సినిమాల గురించి చూసుకుంటే.. తమిళంలో కార్తీతో సర్దార్ -2 మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడలో గాథ వైభవ అనే మూవీలో కూడా నటిస్తోంది.
