తమిళ యాక్టర్ క్లైమాక్స్ మార్చి హిట్ కొట్టేనా?
ఏ సినిమాకైనా క్లైమాక్స్ గుండె లాంటిదంటారు. అందుకే మేకర్స్ ఈ క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Nov 2025 11:00 PM ISTఏ సినిమాకైనా క్లైమాక్స్ గుండె లాంటిదంటారు. అందుకే మేకర్స్ ఈ క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కేవలం క్లైమాక్స్ వల్ల ఎన్నో సినిమాలు హిట్ అవగా, అదే క్లైమాక్స్ ప్రభావం వల్ల చాలా సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరూ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు.
తమిళంలో ఆర్యన్ కు మిక్డ్స్ రెస్పాన్స్
అయితే ఇప్పుడదంతా ఎందుకొచ్చిందంటే రీసెంట్ గా కోలీవుడ్ యాక్టర్ విష్ణు విశాల్ నటించిన ఆర్యన్ సినిమాకు క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ మంచి రెస్పాన్స్ రాలేదు. తమిళంలో గత వారం రిలీజైన ఈ సినిమాకు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ చూశాక ఆడియన్స్ నిరాశ పడుతూ డిజప్పాయింట్ అయ్యారు. వాస్తవానికి ఆర్యన్ మూవీకి మేకర్స్ రెండు క్లైమాక్స్ లను షూట్ చేశారట.
క్లైమాక్స్ చూసి పెదవి విరిచిన తమిళ ఆడియన్స్
అందులో ఆల్రెడీ రిలీజైన సినిమాలో ఓ క్లైమాక్స్ ఉండగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ కు మరో క్లైమాక్స్ ను జోడిస్తుందట చిత్ర యూనిట్. వాస్తవానికి ఆర్యన్ మూవీ తమిళంలో రిలీజైనప్పుడే తెలుగులోనూ రిలీజవాల్సింది కానీ బాహుబలి ఎపిక్, మాస్ జాతర వల్ల ఆర్యన్ తెలుగు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు.
కొత్త క్లైమాక్స్ తో రిలీజ్ కానున్న ఆర్యన్
ఇప్పుడు తెలుగు వెర్షన్ కు క్లైమాక్స్ ను మార్చడంతో పాటూ కోలీవుడ్ విమర్శకులు చెప్పిన కొన్ని విషయాలను కూడా ఫాలో అవుతూ కొత్తగా మార్చారని అంటున్నారు. ఇలా క్లైమాక్స్ మార్చడం లాంటివి ఏ ఇండస్ట్రీలో అయినా చాలా రేర్ గా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఈ క్లైమాక్స్ మార్చడం వల్ల ఏమైనా మంచి ఫలితాలుంటాయేమో చూడాలి. తమిళంలో క్లైమాక్స్ పై ఆడియన్స్ అసంతృప్తిగా ఉంటేనే సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకుని క్లైమాక్స్ ను మార్చి రిలీజ్ చేస్తున్న ఆర్యన్ తెలుగు వెర్షన్ విష్ణు విశాల్ కు సక్సెస్ ను ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కెరీర్ మొదట్నుంచి డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తారని విష్ణు విశాల్ కు ప్రత్యేక గుర్తింపుంది. అలాంటి ఆయన్నుంచి రాబోతున్న ఆర్యన్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
