మరో నటవారసుడు నటనకు దూరంగా!
బాలీవుడ్ లో నేపో కిడ్స్ గురించి చాలా చర్చ సాగుతోంది. ఇటీవల నటవారసుల వెల్లువ అంతకంతకు పెరుగుతోంది.
By: Sivaji Kontham | 30 Sept 2025 9:24 AM ISTబాలీవుడ్ లో నేపో కిడ్స్ గురించి చాలా చర్చ సాగుతోంది. ఇటీవల నటవారసుల వెల్లువ అంతకంతకు పెరుగుతోంది. నటనలో అంతగా రాణించలేకపోయిన నటవారసులకు నెటిజనుల నుంచి విమర్శలు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ తండ్రి బాటలో వెళ్లకుండా, దర్శకుడయ్యాడు. `ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` పేరుతో అతడు వెబ్ సిరీస్ తెరకెక్కించి అందరి మెప్పు పొందాడు. తన తండ్రి బాటలో అతడు హీరో అవ్వాలని అనుకోలేదు. స్టార్ డమ్ అనే వ్యామోహం లేకపోవడంపై చాలా విస్మయం వ్యక్తమవుతోంది.
అయితే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ మాత్రం పెద్ద స్టార్లుగా రాణించాలని నటనలోకి వెళ్లారు. మరోవైపు అక్షయ్ కుమార్ కుమారుడు ఏం చేయబోతున్నాడు? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అయితే అతడి గురించి తాజా అప్ డేట్ షాకిస్తోంది. తన కుమారుడు కూడా తనలాగే నటనలోకి రావాలని అక్షయ్ కోరుకుంటున్నాడు. కానీ ఆరవ్ కి నటనపై ఆసక్తి లేదు. కనీసం సొంత బ్యానర్- ప్రొడక్షన్ అయినా చూడాలని కోరుకుంటున్నాను... అని అక్షయ్ తెలిపారు. కానీ ఆరవ్ మాత్రం ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకుంటున్నాడు.. అని అక్కీ తెలిపారు.
నేను నా కుమారుడికి స్నేహితుడిలా ఉంటాను. ఆరవ్‌కి ఇప్పుడు 23 సంవత్సరాలు. చాలా త్వరగా పెరిగాడు. అతను విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు . స్టడీస్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అతను ట్వింకిల్ లాంటివాడు... ఆమె కూడా బాగా చదువుతుంది! అని తెలిపాడు.
నాన్నా నేను సినిమాల్లోకి రావాలనుకోవడం లేదు... నాకు ఆసక్తి లేదు అని చెప్పాడు. ఆరవ్ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరుకుంటున్నాడు. ఫ్యాషన్ గురించి అతడు చదువుతున్నాడు. ఆరవ్ ఆనందం అక్కడే ఉంది. అయితే, అతడు సినిమాల్లోకి రావడాన్ని నేను ఇష్టపడతాను.. అయినా కానీ ఆరవ్ నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నాను.. అని అన్నారు.
అక్షయ్ నటించిన జాలీ LLB 3 మిశ్రమ సమీక్షలు వచ్చినా కానీ, ప్రపంచవ్యాప్తంగా రూ127 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ తదుపరి వెల్‌కమ్ టు ది జంగిల్ లో నటించాల్సి ఉంది. బూత్ బంగ్లా, హేరా ఫేరి 3 లలో కూడా కనిపించనున్నాడు.
