Begin typing your search above and press return to search.

ఆరాధ్య బచ్చన్ ఫేక్ న్యూస్ కేసు: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

అభిషేక్ బచ్చన్ తనయ ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై వ‌ప్తోన్న‌ తప్పుడు వార్తలపై బచ్చన్ కుటుంబం వేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.

By:  Srikanth Kontham   |   14 Aug 2026 10:00 PM IST
ఆరాధ్య బచ్చన్ ఫేక్ న్యూస్ కేసు: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
X

అభిషేక్ బచ్చన్ తనయ ఆరాధ్య బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై వ‌ప్తోన్న‌ తప్పుడు వార్తలపై బచ్చన్ కుటుంబం వేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ...న్యాయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కుటుంబం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు తర్వాతి తరాలకు కూడా అలాగే వర్తిస్తాయా అనే దానిపై హైకోర్టు కీలకమైన ప్రశ్నలను లేవనెత్తింది.

సోషల్ మీడియా వేదికగా మైనర్ అయిన ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ..వెబ్‌సైట్లు పూర్తిగా నిరాధారమైన తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన అభిషేక్ బచ్చన్ కుటుంబం, తమ కుమార్తె పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న ఆ ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు సెలబ్రిటీల పరువు నష్టం దావాలకు సంబంధించి కొన్ని లోతైన అంశాలను ప్రస్తావించింది.

ఈ విచారణ సమయంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం మాట్లాడుతూ ఒక కుటుంబం తరతరాలుగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, వారి పేరిట ఉన్న బ్రాండ్ ఇమేజ్ సహజంగానే తర్వాతి తరాలకు కూడా వర్తిస్తాయా అని ప్రశ్నించింది. అయితే మైనర్ల విషయంలో తప్పుడు సమాచారం ప్రసారం చేయడం వారి గోప్యతను , మానసిక ప్రశాంతతను దెబ్బతీయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. సెలబ్రిటీల పిల్లలనే పేరుతో వారిపై ఇష్టానుసారంగా తప్పుడు కథనాలు ప్రసారం చేయడాన్ని ఉపేక్షించలేమని కోర్టు అభిప్రాయపడింది.

ఇంటర్నెట్ .. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతున్న తీరుపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్లిక్‌బైట్ కోసం, వ్యూస్ కోసం సెలబ్రిటీల పిల్లల ఆరోగ్యంపై కూడా తప్పుడు ప్రచారాలు చేయడం అనైతికమని పేర్కొంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఎవరి వ్యక్తిగత జీవితాలను ముఖ్యంగా చిన్న పిల్లలను బద్నామ్ చేసే హక్కు ఎవరికీ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంలో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

గతంలో కూడా బచ్చన్ కుటుంబం తమ కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ పలుమార్లు న్యాయపరమైన పోరాటాలు చేసింది. ఇప్పుడు మైనర్ అయిన ఆరాధ్య బచ్చన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చట్టపరమైన చర్యకు సినీ ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సెలబ్రిటీలైనా? సాధారణ ప్రజలైనా ? పిల్లల హక్కులకు భంగం వాటిల్లేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే సెలబ్రిటీల పిల్లల గోప్యత , పరువు నష్టం కేసుల విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా బాధ్యత గురించి మరోసారి కళ్లు తెరిపించేలా ఉన్నాయి. టెక్నాలజీ , సోషల్ మీడియా వేదికల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి కఠినమైన న్యాయపరమైన చర్యలు ఎంతైనా అవసరమని ఈ ఉదంతం నిరూపిస్తోంది.