భన్సాలీలా మరో దర్శకుడు భారీ ప్రయోగం?
అప్పటివరకూ రొమాంటిక్ కామెడీలు తెరకెక్కించిన ఒక దర్శకుడు ఉన్నట్టుండి పీరియడ్ యాక్షన్ సినిమాలు తీయడానికి రెడీ అవ్వడం పెద్ద సర్ ప్రైజ్ గా మారుతోంది.
By: Sivaji Kontham | 7 Jan 2026 9:57 AM ISTఅప్పటివరకూ రొమాంటిక్ కామెడీలు తెరకెక్కించిన ఒక దర్శకుడు ఉన్నట్టుండి పీరియడ్ యాక్షన్ సినిమాలు తీయడానికి రెడీ అవ్వడం పెద్ద సర్ ప్రైజ్ గా మారుతోంది. సంజయ్ లీలా భన్సాలీ లాంటి కళాత్మక దర్శకుడు కూడా తన రెగ్యులర్ జానర్ ని విడిచిపెట్టి, పీరియడ్ వార్ డ్రామా కమ్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ట్రై చేస్తున్నారు. రణబీర్-ఆలియా-విక్కీ త్రయంతో ఆయన `లవ్ అండ్ వార్` చిత్రాన్ని తనకు పూర్తిగా కొత్తదైన జానర్ లో ప్రయత్నిస్తున్నారు భన్సాలీ. ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు రొమాంటిక్ లవ్ స్టోరీలు, ఎమోషనల్ డ్రామాలతో ఆకట్టుకునే ఆనంద్ ఎల్.రాయ్ ఒక పీరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. చారిత్రక ఘటనలు పీరియడ్ డ్రామా అనగానే భన్సాలీ చేస్తున్న లవ్ అండ్ వార్ మరోసారి అందరికీ గుర్తుకొస్తుంది. కానీ ఆనంద్ ఎల్ రాయ్ తన పీరియడ్ డ్రామాకు ఎలాంటి స్క్రిప్టును ఎన్నుకుంటాడో వేచి చూడాలి. భన్సాలీ వేరు.. ఆనంద్ ఎల్ రాయ్ వేరు. ఆ ఇద్దరూ ఒకే కథను సినిమాగా తీసినా, వేర్వేరు టోన్ లతో వైవిధ్యంగా తీయగలరు. అందుకే ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్ చూపు పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఉంది అనగానే, అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. తాను ఎప్పుడూ ట్రై చేయని ఒక కొత్త జానర్ లో సినిమా తీసి మెప్పించడం అంటే అదేమీ అంత సులువేమీ కాదు. కానీ ఆనంద్ ఎల్ రాయ్ లాంటి సీనియర్ దర్శకుడు దీనిని నిరూపిస్తారని అభిమానులు భావిస్తున్నారు.
ఆసక్తికరంగా ఆయన పీరియడ్ డ్రామాను తెరకెక్కిస్తే ఈ చిత్రంలో ఎవరు కథానాయకుడిగా నటిస్తారు? అంటే.. అతడి ఫేవరెట్ హీరో ధనుష్ కే అవకాశం ఉందని గుసగుస వినిపిస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. ఇటీవల విడుదలైన `తేరే ఇష్క్ మే` కూడా హిట్టయింది. ధనుష్- ఆనంద్ ఎల్ రాయ్ ఇద్దరికీ మంచి పేరొచ్చింది. రాంజానా, అట్రాంగిరే తర్వాత ఇదే కాంబినేషన్ లో మూడో సినిమా తేరే ఇష్క్ మే విజయాన్ని ఆ ఇద్దరూ చాలా ఆస్వాధిస్తున్నారు.
ధనుష్ 54వ చిత్రం D54 షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందని సమాచారం. ఆ తర్వాత ధనుష్ 55 వ చిత్రం డి55 ఆనంద్ ఎల్ రాయ్ తో ఉంటుందా? అన్నదానిపై ఇంకా స్పష్ఠత లేదు. దర్శకుడే స్వయంగా దీనిని అధికారికంగా ప్రకటించే వరకూ వేచి ఉండాల్సిందే.
