Begin typing your search above and press return to search.

స‌ల్మాన్‌పై మురుగ‌దాస్ ఆరోపించిన‌ట్టే అమీర్ కూడా!

కొంద‌రు స్టార్లు సెట్స్ కి చాలా ఆల‌స్యంగా వ‌స్తారు. అలాంటి స్టార్ కోసం సెట్లో ప‌ని చేసే 100 మంది ప‌డిగాపులు ప‌డాల్సి వ‌స్తుంది.

By:  Sivaji Kontham   |   27 Sept 2025 8:00 AM IST
స‌ల్మాన్‌పై మురుగ‌దాస్ ఆరోపించిన‌ట్టే అమీర్ కూడా!
X

కొంద‌రు స్టార్లు సెట్స్ కి చాలా ఆల‌స్యంగా వ‌స్తారు. అలాంటి స్టార్ కోసం సెట్లో ప‌ని చేసే 100 మంది ప‌డిగాపులు ప‌డాల్సి వ‌స్తుంది. అలాంటి స్టార్ల‌లో స‌ల్మాన్ ఖాన్ ఒక‌డు! అంటూ ఇటీవ‌ల మురుగ‌దాస్ లాంటి పెద్ద ద‌ర్శ‌కుడు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే స‌ల్మాన్ ఖాన్ కి కెరీర్ ఆరంభం నుంచి ఇలాంటి ఒక అల‌వాటు ఉందా? అన్న‌ది ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

మురుగ‌దాస్ ఆరోపించిన‌ట్టే ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా స‌ల్మాన్ ఖాన్ అల‌వాట్ల గురించి ఆరోపించ‌డం హాట్ టాపిగ్గా మారింది. `టూమ‌చ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్` షోలో స‌ల్మాన్ ఖాన్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. `అందాజ్ ఆప్నే ఆప్నే` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అత‌డు చాలా ఆల‌స్యంగా సెట్స్ కి వ‌చ్చేవాడ‌ని, అప్ప‌టివ‌ర‌కూ తాము ఎదురు చూపులు చూసేవాళ్ల‌మ‌ని చెప్పాడు. ఆ సినిమా తర్వాత సల్మాన్‌తో మళ్ళీ ఎప్పుడూ పనిచేయనని అమీర్ ఖాన్ శపథం చేశారట‌.

అత‌డికి స‌మ‌య‌పాల‌న లేదు.. అది చాలా స‌మ‌స్య‌. అత‌డు క‌నీసం మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కు సెట్స్ పైకి వ‌చ్చినందుకు చాలా సంతోషించేవాళ్ల‌ము. మొద‌ట అత‌డు రాగానే నిద్ర‌పోయేవాడు.. భోజ‌నం చేసేవాడు.. అప్ప‌టికి స‌గం రోజు గ‌డిచిపోతుంది.. స‌ల్మాన్ నిదుర లేవ‌గానే సీన్ వివ‌రించ‌డానికి నేను - రాజ్ వెళ్లేవాళ్లం. అప్పుడు కూడా అతడు పరధ్యానంలో కనిపిస్తూ అక్కడే కూర్చునేవాడు.. అతడు నన్ను సహాయకుడిలా చూసేవాడు.. అంటూ అమీర్ చాలా ఫిర్యాదులు చేసాడు.

అమీర్ ఖాన్ వాద‌న‌ను బ‌ట్టి స‌ల్మాన్ ఖాన్ చాలా కాలంగా ఇదే పంథాలో ఉన్నాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.. మురుగ‌దాస్ కూడా సల్మాన్ కి స‌మ‌య‌పాల‌న లేద‌ని విమ‌ర్శించిన నేప‌థ్యంలో ఇది ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

అయితే అమీర్ ఖాన్ కి కౌంట‌ర్ వేసేందుకు స‌ల్మాన్ వెన‌కాడ‌లేదు. అత‌డు ఇలా అన్నాడు. మేం అందాజ్ అప్నా అప్నాలో పనిచేస్తున్నప్పుడు అమీర్ ఖాన్ ఉదయం 7 గంటలకు సెట్‌కి వచ్చేవారు.. ఆ షిఫ్ట్ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేది. ఎందుకంటే ఆయన ఒకే సినిమా చేసేవాడు. కానీ నాకు 15 సినిమాలు ఉన్నాయి. నేను ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.., తరువాత మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు,.. ఆపై మళ్ళీ రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు పని చేసేవాడిని. కాబట్టి నేను వచ్చే సమయానికి బాగా అలసిపోయేవాడిని.. ఆపై అతడు చాలా రిహార్సల్స్ చేసేవాడు. అతడు చివరకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నాకు ఫోన్ చేయమని చెప్పేవాడిని. కాబట్టి ఆ సమయంలో పనిపై నాకు ఆసక్తి లేదని అతడు భావించాడు! అని స‌ల్మాన్ కౌంట‌ర్ ఇచ్చారు. ఆ త‌ర్వాత అమీర్ ఖాన్ న‌వ్వుతూ నెమ్మ‌దిగా నేను మ‌న‌మంతా మ‌నుషుల‌మేన‌ని గ్ర‌హించాను అని అన్నారు. స‌ల్మాన్ ఒకేసారి 15 సినిమాల‌కు ప‌ని చేసేంత బిజీగా ఉన్న‌ప్పుడు సెట్స్ కి ఆల‌స్యంగా వ‌చ్చేవారు.. కానీ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నా అప్ప‌టి అల‌వాట్ల‌ను కొన‌సాగిస్తున్నాడా? అన్న‌ది ఆలోచించ‌త‌గిన‌దే.