ఇకపై బాలీవుడ్ అనొద్దంటున్న సల్మాన్.. మరేమనాలి?
బాలీవుడ్ బడా హీరోలు.. ముగ్గురు ఖాన్ లు.. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనపడడం చాలా అరుదు.
By: M Prashanth | 18 Oct 2025 9:24 PM ISTబాలీవుడ్ బడా హీరోలు.. ముగ్గురు ఖాన్ లు.. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనపడడం చాలా అరుదు. అలాంటిది ఒకే వేదికను పంచుకోవడం ఇంకా అరుదు. ఇప్పుడు ఆ అరుదైన సన్నివేశానికి సౌదీ అరేబియాలోని రియాద్ వేదికైంది. అక్కడ జరిగిన జాయ్ ఫోరం 2025 ఈవెంట్ లో అమీర్, సల్మాన్, షారుక్ సందడి చేశారు.
రెండు రోజులపాటు జరిగిన గ్లోబల్ ఈవెంట్ లో ముగ్గురూ కలిసి పాల్గొనగా.. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినీ ప్రియులను, నెటిజన్లను ఆకట్టుకుని సందడి చేస్తున్నాయి. సూపర్ మూమెంట్స్ అని అంతా కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈవెంట్ లో 1968లో వచ్చిన 'అనోఖి రాత్' సినిమాలోని 'ఓ రే తాల్ మిలే నది కే జల్ మే' పాటను అమీర్ ఖాన్.. ఆడియన్స్ కోసం ఆలపించారు. ఆ సమయంలో సల్మాన్, షారుక్ ఎంకరేజ్ చేశారు. అంతే కాదు.. పక్కన నిల్చుని చేతులు ఊపుతూ ఉత్సాహపరిచారు. అమీర్ కు తాము బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్ అంటూ కామెడీ చేశారు.
సౌదీ అరేబియాలో అమీర్ ఫస్ట్ క్యాన్సెర్ట్ అంటూ చెప్పిన షారుఖ్.. చప్పట్లు గట్టిగా కొట్టమని సందడి చేశారు. ఆ తర్వాత ముగ్గురూ అనేక విషయాలను పంచుకున్నారు. తమ తమ కెరీర్లు, సినిమాలు, సినీ పరిశ్రమ వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. వివిధ సందర్భాల్లో వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు.
అయితే మొత్తం అయ్యాక షారుఖ్ ఖాన్.. ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మాట్లాడామని, ఇక ఇంత మంచి అవకాశం ఇచ్చిన సౌదీకి థ్యాంక్స్ చెప్పాలని అన్నారు. ఆ తర్వాత హోస్ట్ కు థ్యాంక్స్ చెప్పారు. అనంతరం ముగ్గురు ఖాన్స్ నిల్చుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడికి వచ్చిన ఆడియన్స్ చూపించిన లవ్ కు అమీర్ ధన్యావాదాలు తెలిపారు.
ఆ సమయంలో సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ అని అనొద్దని.. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అనాలని షారుఖ్ వైపు చూసి అన్నారు. ఆ వెంటనే ఆయన కూడా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పారు. ఈవెంట్ లో తాము ముగ్గురూ చాలా ఫన్ చేశామని షారుఖ్ ఖాన్ తెలిపారు. సౌదీతోపాటు వివిధ దేశాల్లో తమ సినిమాల షూటింగ్స్ జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
