Begin typing your search above and press return to search.

ఆడియ‌న్స్‌కు బాలీవుడ్ స్టార్ క్ష‌మాప‌ణ‌లు

తాజాగా థియేట్రిక‌ల్ ర‌న్ ను ముగించుకున్న సితారే జ‌మీన్ ప‌ర్ ను ఆమిర్ యూట్యూబ్ ద్వారా ఆడియ‌న్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Aug 2025 3:59 PM IST
ఆడియ‌న్స్‌కు బాలీవుడ్ స్టార్ క్ష‌మాప‌ణ‌లు
X

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తాజా చిత్రం సితారే జ‌మీన్ ప‌ర్. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. ఈ సినిమాను మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఆమిర్ ఖాన్ దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయ‌న‌ని చెప్పుకుంటూనే వ‌చ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్టే సితారే జ‌మీన్ ప‌ర్ డిజిట‌ల్ రైట్స్‌ను ఏ ఓటీటీకి విక్ర‌యించ‌లేదు.

యాపిల్ యూజ‌ర్ల‌కు ఎక్కువ రేటు

తాజాగా థియేట్రిక‌ల్ ర‌న్ ను ముగించుకున్న సితారే జ‌మీన్ ప‌ర్ ను ఆమిర్ యూట్యూబ్ ద్వారా ఆడియ‌న్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు. పే ప‌ర్ వ్యూ మోడ‌ల్ లో త‌న అఫీషియ‌ల్ యూట్యూబ్ లో ఆమిర్ ఈ సినిమాను రిలీజ్ చేయ‌గా ఈ సినిమాను చూసేందుకు రూ.100ను రెంట్ గా ఆమిర్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే యాపిల్ డివైస్‌ల్లో మాత్రం ఈ రెంట్ రూ.179 గా చూపిస్తుండ‌టంతో ఈ విష‌యంలో ఆమిర్ కు ఆడియ‌న్స్ నుంచి కంప్లైంట్స్ వ‌స్తున్నాయి.

క్ష‌మించ‌మ‌ని కోరిన‌ ఆమిర్ ప్రొడ‌క్ష‌న్స్

కాగా ఆ కంప్లైంట్స్ పై ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ స్పందిస్తూ, క్ష‌మాప‌ణ‌లు తెలిపింది. ప్రాబ్ల‌మ్ త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, వీలైనంత త్వర‌గా దాన్ని ప‌రిష్క‌రిస్తార‌మ‌ని, ప‌రిస్థితులను అర్థం చేసుకుని కో-ఆప‌రేట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఫ‌స్ట్ నుంచీ ఓటీటీలకు వ్య‌తిరేకిన‌ని చెప్పిన ఆమిర్, ఆడియ‌న్స్ కు త‌క్కువ ధ‌ర‌లో సినిమాలు అందించేందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్న‌ట్టు ఎప్ప‌ట్నుంచో చెప్తున్నారు.

ఆమిర్ మెయిన్ టార్గెట్ అదే!

హీరోలంతా త‌మ సినిమాలు థియేట్రిక‌ల్ రిలీజ్ పూర్త‌య్యాక ప్ర‌ముఖ ఓటీటీల్లో రావాల‌నుకుంటారైతే ఆమిర్ ఖాన్ మాత్రం ఈ విష‌యంలో చాలా కొత్త‌గా ఆలోచించి త‌న సినిమాను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీని వ‌ల్ల ఆడియ‌న్స్ ను తిరిగి థియేట‌ర్ల‌కు తీసుకురావ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్తున్న ఆమిర్, ఆడియ‌న్స్ కు త‌క్కువ ధ‌ర‌లో సినిమాను చూపించడమే త‌న ప్ర‌య‌త్నంగా తెలిపారు.

పాత సినిమాలు కూడా..

ఈ సినిమానే కాదు, త‌న పాత సినిమాల‌ను కూడా ఆమిర్ త్వ‌ర‌లోనే త‌న యూట్యూబ్ ఛానెల్ లో పే ప‌ర్ వ్యూ మోడ‌ల్ లో అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు చెప్పారు. వాటితో పాటూ కొత్త డైరెక్ట‌ర్లకు స‌పోర్ట్ చేస్తూ వారి ప్లాన్స్ ను ముందుకు తీసుకెళ్లే దిశ‌గా కూడా ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాగా ఆమిర్ ఖాన్ ఫేమ‌స్ టీవీ సిరీస్ స‌త్య‌మేవ‌ జ‌య‌తే త్వ‌ర‌లోనే ఆడియ‌న్స్ కు ఉచితంగా అందుబాటులోకి రానుంది.