Begin typing your search above and press return to search.

నారీ నారీ నడుమ ముచ్చటైన మొగోడు.. ముగ్గురు భార్య‌ల ముద్దుల‌ హీరో!

ఈ పుట్టినరోజు వేడుకలో ఆయన మొదటి భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావు .. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న ప్రియురాలు (కొందరు మూడో భార్యగా అభివర్ణిస్తున్న) గౌరి స్ప్రాట్ కలిసి సందడి చేయడం విశేషం.

By:  Sivaji Kontham   |   15 March 2026 8:21 PM IST
నారీ నారీ నడుమ ముచ్చటైన మొగోడు.. ముగ్గురు భార్య‌ల ముద్దుల‌ హీరో!
X

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన 61వ పుట్టినరోజు వేడుకలను అత్యంత విలక్షణంగా జరుపుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఎవరైనా విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్యలతో దూరంగా ఉంటారు.. కానీ అమీర్ మాత్రం తన పాత, కొత్త బంధాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి `నారీ నారీ నడుమ ముచ్చటైన మొగోడు` అనిపించుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకలో ఆయన మొదటి భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావు .. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న ప్రియురాలు (కొందరు మూడో భార్యగా అభివర్ణిస్తున్న) గౌరి స్ప్రాట్ కలిసి సందడి చేయడం విశేషం.

ముగ్గురు భార్యల నడుమ నలిగిపోవడం పక్కన పెడితే.. వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చి అమీర్ ఖాన్ ఒక అరుదైన .. అందమైన కల్చర్‌ను క్రియేట్ చేశారు. ఒకప్పటి మాజీలు, ప్రస్తుత భాగస్వామి అంతా కలిసి ఒకే కుటుంబ సభ్యుల్లా, అక్కాచెల్లెళ్లలా కలిసిపోయి అమీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చూస్తుంటే నెటిజన్లు `యు ఆర్ గ్రేట్ అమీర్ భాయ్` అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి బంధాలకు గౌరవం ఇవ్వడంలో అమీర్ నిజంగానే ట్యాలెంటెడ్ హీరో అని నిరూపించుకున్నారు.

అమీర్ ఖాన్ 61వ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేక్ కటింగ్ సమయంలో రీనా దత్తా, కిరణ్ రావు ఆయన పక్కనే ఉండి ఉత్సాహంగా పాలుపంచుకోగా.. గౌరి స్ప్రాట్ కూడా వారితో కలిసి ఎంతో క్లోజ్‌గా మెలిగారు. సాధారణంగా ఇద్దరు భార్యల మధ్యే యుద్ధాలు జరుగుతుంటాయి.. కానీ ఇక్కడ ముగ్గురు మహిళలు ఎంతో సామరస్యంగా ఉండటం చూసి బాలీవుడ్ వర్గాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి.

ఈ సెలబ్రేషన్స్ కేవలం పుట్టినరోజు వేడుకలా కాకుండా.. ఆధునిక సంబంధాలకు ఒక కొత్త నిర్వచనంలా కనిపించాయి. పిల్లల పెంపకం విషయంలో కానీ.. కుటుంబ వేడుకల్లో కానీ అమీర్ ఎప్పుడూ తన మాజీ భార్యలను భాగస్వాములను చేస్తూనే ఉంటారు. తాజాగా గౌరి స్ప్రాట్‌తో ఆయన రిలేషన్‌షిప్ గురించి చర్చ జరుగుతున్న తరుణంలో ఆమెను కూడా ఈ ఫ్యామిలీ ఫ్రేమ్‌లోకి తీసుకురావడం ద్వారా అమీర్ తనదైన శైలిలో అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్లయింది.

ఏది ఏమైనా 61 ఏళ్ల వయసులో కూడా అమీర్ ఖాన్ తన లౌకిక వాదంతో.. తన విలక్షణమైన లైఫ్ స్టైల్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. ముగ్గురు భార్యలతో ఆటలాడుకుంటూనే.. వారి మధ్య ఎంతో అన్యోన్యంగా ఉంటూ అమీర్ జరుపుకున్న ఈ పుట్టినరోజు వేడుకలు `సినిమాటిక్` గా ఉన్నాయ‌ని కొంద‌రు వ్యాఖ్యానించినా.. బంధాలను ఎలా నిలబెట్టుకోవాలో.. మాజీలతో ఎలా స్నేహంగా ఉండాలో అమీర్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

సినిమాల మ్యాట‌ర్ కి వ‌స్తే.. `హ్యాపీ నెక్స్ట్ ఇయ‌ర్` అనే రొమాంటిక్ డ్రామాలో న‌టించ‌నున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. లోకేష్ క‌న‌గ‌రాజ్ తో సౌత్ ఎంట్రీ ఇస్తాడ‌న్న గుస‌గుసా వినిపిస్తోంది. కానీ వేటినీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.