Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ 'ల‌వ్ జిహాద్'.. దిష్టిబొమ్మ ద‌హ‌నం!

అమీర్ ఖాన్ రెండు పెళ్లిళ్లు బ్రేక‌ప్ అయ్యాక‌, ఇటీవ‌ల బెంగ‌ళూరుకు చెందిన గౌరి స్ప్రాట్ ని మూడో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   12 July 2026 12:13 AM IST
అమీర్ ఖాన్ ల‌వ్ జిహాద్.. దిష్టిబొమ్మ ద‌హ‌నం!
X

అమీర్ ఖాన్ రెండు పెళ్లిళ్లు బ్రేక‌ప్ అయ్యాక‌, ఇటీవ‌ల బెంగ‌ళూరుకు చెందిన గౌరి స్ప్రాట్ ని మూడో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గౌరీకి అప్ప‌టికే ఒక కుమారుడు ఉన్నాడు. ఏడాది పైగా రిలేష‌న్ షిప్ లో ఉన్న అమీర్ ప్ర‌తిదీ సీక్రెట్ గా ఉంచారు. ఎట్ట‌కేల‌కు త‌న పెళ్లిని అధికారికం చేసాడు.

అయితే ఈ పెళ్లిపై బిహార్‌లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఆమిర్ ఖాన్ వరుసగా హిందూ మహిళలను వివాహం చేసుకుంటున్నార‌ని.. ఇది `లవ్ జిహాద్`అని అభివర్ణించారు. ఆమిర్ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘ‌ట‌నపై అమీర్ స్పందించ‌లేదు.

ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తన దృష్టినంతా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా `లల్కారా` చిత్రంపైనే పెట్టారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకవైపు సినిమా కమిట్‌మెంట్లతో బిజీగా ఉన్న ఆమిర్ ఖాన్, తన మూడో పెళ్లిపై నిర‌స‌న‌లు లేదా ఆరోపణలపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన టీమ్ కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించింది.

నిజానికి అమీర్ ఖాన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని కూడా ముగ్గురు భార్య‌ల‌తో సఖ్యంగా ఉన్నారు. విడాకుల త‌ర్వాతా అమీర్ ఖాన్ కి మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నారు మాజీలు రీనా ద‌త్తా, కిర‌ణ్ రావు. అలాగే బ్రేక‌ప్ త‌ర్వాత మాజీ భార్య‌ల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగించాడు. అంతేకాదు తొలి భార్య రీనా సంతానం, కిర‌ణ్ రావు కుమారుడిని కూడా హీరోలను చేయ‌డానికి అత‌డు బాధ్య‌త తీసుకున్నారు. ఇప్పుడు మూడో భార్య గౌరీతోను మాజీ భార్య‌లు స‌ఖ్యంగా క‌లిసిపోతున్నారు. ఒక ర‌కంగా అమీర్ ఖాన్ త‌న ప్ర‌వృత్తితో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. అయితే ఒక సెక్ష‌న్ ప్ర‌జ‌లు ఎప్పుడూ ఖాన్ ల‌పై విరుచుకుప‌డుతూనే ఉంటారు.

మూడు పెళ్లిళ్ల త‌ర్వాత కూడా అమీర్ ఖాన్ ఇంకా ఎన‌ర్జిటిక్ గా క‌నిపిస్తున్నారు. అత‌డు తదుప‌రి త‌న సినిమాల‌ను వ‌రుసగా ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. రాజ్ కుమార్ హిరాణీతో పాటు, ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో అమీర్ ఖాన్ ప‌ని చేయ‌నున్నాడు.