Begin typing your search above and press return to search.

ముగ్గురు భార్య‌ల‌ను క‌లుసుకోవ‌డం అదృష్టం అనేశాడు!

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ 60 వ‌య‌సులో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. బెంగ‌ళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో అత‌డి స్నేహం, ప్రేమాయ‌ణం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By:  Sivaji Kontham   |   8 Dec 2025 7:00 AM IST
ముగ్గురు భార్య‌ల‌ను క‌లుసుకోవ‌డం అదృష్టం అనేశాడు!
X

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ 60 వ‌య‌సులో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. బెంగ‌ళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో అత‌డి స్నేహం, ప్రేమాయ‌ణం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌డు గౌరీని అధికారికంగా మీడియాకు ప‌రిచ‌యం చేసాడు. అన్ని పుకార్ల‌కు చెక్ పెట్టాడు. ఇప్పుడు త‌న మాజీ భార్య‌ల‌తో త‌న రిలేష‌న్ షిప్ ఎలా ఉందో బ‌హిరంగంగా మాట్టాడి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. మాజీ భార్య‌లు రీనా ద‌త్తా, కిర‌ణ్ రావు, వారి కుటుంబీకులు ఇప్ప‌టికీ త‌న కుటుంబం అని అమీర్ ఖాన్ అన్నారు.

తన ఇద్ద‌రు భార్య‌ల నుంచి తాను చాలా నేర్చుకున్నాన‌ని అమీర్ ఖాన్ అన్నాడు. రీనా ఎంతో మంచి వ్య‌క్తి. త‌న‌తో క‌లిసి పెరిగాను. మేం భార్యాభ‌ర్త‌లుగా విడిపోయినా మ‌నుషులుగా క‌లిసే ఉన్నాము. త‌నంటే ప్రేమ గౌర‌వం ఉన్నాయి. మేం స్నేహంగా ఉన్నాము. ఎప్ప‌టికీ మనుషులుగా విడిపోలేదు అని అమీర్ అన్నారు. కిర‌ణ్ రావుతోనే అదేవిధంగా ఉన్నాన‌ని తెలిపాడు. కిర‌ణ్ అద్భుత‌మైన వ్య‌క్తి. మేం భార్యాభ‌ర్త‌లుగా మాత్ర‌మే విడిపోయాము. రీనా, ఆమె త‌ల్లిదండ్రులు, కిర‌ణ్ ఆమె త‌ల్లిదండ్రులు, మేమంతా ఒకే కుటంబం అని కూడా అమీర్ ఖాన్ అన్నారు.

అయితే 60 వ‌య‌సులో మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌టంపై మీడియా ప్ర‌శ్నించ‌గా, తాను దీనిని ఊహించ‌లేద‌ని అన్నాడు. ఈ వ‌య‌సులో ఇంకా ఇది కుదురుతుంద‌ని తాను భావించ‌లేద‌ని అన్నాడు. త‌న‌కు భాగ‌స్వామి కాగ‌ల వ్య‌క్తి దొరుకుతుంద‌ని తాను అనుకోలేద‌ని తెలిపాడు. గౌరీ ప్ర‌శాంత‌త‌ను స్థిర‌త్వాన్ని ఇస్తుంది. నిజంగా అద్భుతమైన వ్య‌క్తి. నేను ఆమెను క‌ల‌వ‌డం అదృష్టం. నా ముగ్గురు భార్య‌ల‌ను క‌ల‌వ‌డం నా అదృష్టం. వారి నుంచి నేను నేర్చుకున్నాను! అని అమీర్ ఖాన్ అన్నారు.

స్టార్ హీరో అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు.. వారికి ఇద్దరు పిల్లలు, జునైద్ - ఇరా. 16 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 2002లో విడిపోయారు. ఆమిర్ తరువాత 2005లో స‌హాయ‌ద‌ర్శ‌కురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. 2011లో ఈ జోడీ కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌ను స్వాగతించారు. 2021లో ఆమిర్ - కిరణ్ విడిపోతున్నామ‌ని ప్రకటించారు. మార్చి 2025లో, అతను తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌కు మీడియాను పరిచయం చేశాడు. 25 సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసున‌ని, 18 నెలలుగా డేటింగ్‌లో ఉన్నారని వెల్లడించాడు. గౌరీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ ఇద్ద‌రూ అన్యోన్యంగా క‌లిసి జీవించడం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, అమీర్ ఖాన్ తదుపరి `హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపిస్తాడు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం తో హాస్యనటుడు వీర్ దాస్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. అమీర్ మేన‌ల్లుడు ఇమ్రాన్ ఖాన్ ఈ చిత్రంతో తిరిగి పెద్ద తెరపైకి వ‌స్తున్నాడు. ఈ స్పై-కామెడీ చిత్రం 16 జనవరి 2026న థియేటర్లలో విడుదల కానుంది.