కార్పొరేట్ బుకింగ్స్ అనేది పూర్తిగా నాన్ సెన్స్
సినిమా ఇండస్ట్రీలో పెరుగుతున్న కార్పొరేట్ బుకింగ్స్ ట్రెండ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 15 Sept 2025 12:50 PM ISTసినిమా ఇండస్ట్రీలో పెరుగుతున్న కార్పొరేట్ బుకింగ్స్ ట్రెండ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే బల్క్‌లో టికెట్లు బుక్ చేసుకొని కలెక్షన్స్‌ను బూస్ట్ చేస్తున్నారన్న అనుమానాలు ప్రేక్షకుల్లో పెరిగిపోతున్నాయి. కొన్ని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గానే ఆడుతున్నప్పటికీ.. ఇలాంటి స్ట్రాటజీ వాడటం వల్ల షార్ట్‌టర్మ్‌లో ట్రేడ్ నంబర్స్ ఎక్కువగా కనిపించినా, లాంగ్ టర్మ్‌లో దీని ప్రభావం, ఆడియెన్స్ లో రెస్పాన్స్ ఉండదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాతే అసలు రియాక్షన్ బయటపడుతుంది. అలా బాక్సాఫీస్ వద్ద హిట్ అని చెప్పుకున్న కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తాజాగా స్పందించారు.
తాజాగా దీనిపై ఆమిర్ మాట్లాడుతూ... కార్పొరేట్ బుకింగ్స్ అనేది పూర్తిగా నాన్ సెన్స్ అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. ఇలాంటివి చేయడం వల్ల ఫిల్మ్ మేకర్స్ - ఆడియెన్స్ మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి స్ట్రాటజీ వాడి లాభం పొందతామనుకునే నిర్మాతలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలను ఎక్కువకాలం మోసం చేయలేము.
ఎప్పటికైనా అసలైన నిజం ఎప్పటికీ బయటపడుతుంది. తప్పుడు నెంబర్లో ఏదీ సాధ్యం కాదు. అని ఆమిర్ ఖాన్ క్లారిటీ కార్పోరేట్ బుకింగ్స్ పై మాట్లాడారు. ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోగా ఆమిర్ కు పేరుంది. అలాంటి ఆయన ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడిన ఆమిర్ ఖాన్ పై ఫ్యాన్స్ విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ట్రేడ్ లో నిజాయితీ ఉంటేనే ఇండస్ట్రీపై ప్రేక్షకుల నమ్మకం నిలుస్తుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
