రజినీ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ స్టార్
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కొందరు పాటించే సూత్రం. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది దీన్ని ఫాలో అవుతూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 3 Aug 2025 1:21 PM ISTఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కొందరు పాటించే సూత్రం. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా ఇదే రూల్ ను పాటిస్తున్నారు. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.
అంతటి స్టార్ హీరో ఇప్పుడు మరొకరి కాళ్లకు ఒంగి మరీ నమస్కరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమిర్ అలా పాదాలకు దండం పెట్టింది మరెవరికో కాదు, సూపర్ స్టార్ రజినీకాంత్‌కు. వీరిద్దరూ కలిసి కూలీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాజాగా కూలీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరగ్గా ఆ ఈవెంట్ లో ఇది చోటుచేసుకుంది.
దాహా గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమిర్
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటూ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు ఆమిర్ ఖాన్ కూలీలోని తన క్యారెక్టర్ అయిన దాహా గెటప్ లో ఎంతో ఎనర్జిటిక్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆడియన్స్ ను ఎంతో ఉత్సాహంగా పలకరించారు.
రజినీకి వీరాభిమాని
ఆ తర్వాత రజినీకాంత్ వద్దకు వెళ్లి ఆయన్ను పలకరించడమ కాకుండా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు ఆమిర్. తన పాదాలకు నమస్కరించిన ఆమిర్ ను వెంటనే పైకి లేపి రజినీ తన గుండెలకు హత్తుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రజినీకి తానెంతో పెద్ద ఫ్యాన్ ను అని ఆమిర్ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. లోకేష్ తనను కలిసి ఈ సినిమా చేయాలని చెప్పినప్పుడు కూడా కనీసం కథ కూడా వినకుండానే ఓకే చేశానని, దానికి కారణం రజనీపై తనకున్న అభిమానమే అని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తానని చెప్పారు.
