Begin typing your search above and press return to search.

రాజమౌళి × ఆమిర్ మధ్య తిండి గొడవ

ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  M Prashanth   |   19 Sept 2025 11:34 AM IST
రాజమౌళి × ఆమిర్ మధ్య తిండి గొడవ
X

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గా మహాభారతం అనే గొప్ప భారతీయ పురాణాన్ని సినిమా రూపంలో తెరపై ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పై అనేక వార్తలు వస్తున్నప్పటికీ, ఈ విశాలమైన ప్రాజెక్ట్ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మరియు ప్రణాళికలు సంచలనం రేపుతున్నాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహాభారతం ప్రాజెక్ట్ పై అనేక అంచనాలు ఉన్నాయి. గ్రేటెస్ట్ డైరెక్టర్ రాజమౌళి మహాభారతం సినిమాను తెరకెక్కించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా పలుమార్లు గతంలో పేర్కొన్నారు. అటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కు సైతం మహాభారతం సినిమా రూపొందించాలనేది కలగా పెట్టుకున్నారు.

ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల కోసం ఈ ఇద్దరూ కొలాబరేట్ అవుతున్నారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ తాజా వెబ్ సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ కు ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి- ఆమిర్ కలిసిన వీడియో చక్కర్లు కొడుతోంది.

ఇందులో రాజమౌళిని ఆమిర్ ఖాన్.. ఇడ్లీ సాంబార్ లేదా వడాపావ్ ఇందులో ఏది బెస్ట్ అని అడుగుతారు. దీనికి ఇదో ప్రశ్నా? ప్రపంచం అంతా తెలుసు వడాపావ్ బెస్ట్ అని జక్కన్న సమాధానం చెబుతారు. కానీ ఇడ్లీ సాంబారే అని ఆమిర్ ఆయనతో వాదిస్తారు. పుణెలో అద్భుతమైన ఇడ్లీ సాంబార్ దొరుకుందని ఆమిర్ చెబుతుంటారు. ఇంతలో అసిస్టెంట్ వచ్చి, షాట్ రెడీ అయ్యిందంటూ జక్కన్నను తీసుకెళ్తారు.

దీంతో ఆ డిస్కషన్ ను కంటిన్యూ చేద్దాం సార్ అని ఆమిర్.. రాజమౌళితో చెబుతారు. దానికి రిప్లైగా జక్కన్న ఇట్ ఈజ్ వీపీ అంటూ వెళ్లిపోతారు. ఈ సంభాషణను దూరం నుంచి గమనిస్తున్న వెబ్ సిరీస్ నటులు రాఘవ్ జుయల్.. ఇడ్లీ సాంబార్ అంటే ఇటలీలో షూటింగ్ ప్లాన్ చేసినట్లున్నారు అని అంటారు. అలా ఈ సంభాషణ ఫన్నీగా సాగిపోయింది.

కానీ, ఈ ఇద్దరూ తమ డ్రీమ్ ప్రాజెక్ట్ లు మహాభారతం గురించి ఏదో హింట్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. కానీ ఏదేమైనా ఆ ప్రాజెక్టుల గురించి వాళ్లే ఆనౌన్స్ చేస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కోరతున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎమ్ బీ29 సినిమాతో బీజీగా ఉన్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భారీ రేంజ్ లో తెరకెక్కుతోంది.