భార్యతో మాట్లాడకుండా షట్టర్లు దించేసిన స్టార్ హీరో
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకుల గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. నిరంతరం బ్రేకప్ వార్తలు మీడియా హెడ్ లైన్స్ లో వస్తుంటే, అవి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి
By: Sivaji Kontham | 7 Oct 2025 4:00 AM ISTఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకుల గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. నిరంతరం బ్రేకప్ వార్తలు మీడియా హెడ్ లైన్స్ లో వస్తుంటే, అవి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అప్పటివరకూ ఎంతో గొప్ప ఆదర్శజంటగా భావించిన కపుల్ ఉన్నట్టుండి చిన్నపాటి చికాకులతోనే విడిపోతుండడం అందరికీ షాకిస్తోంది. అయితే భార్యా భర్తల అనుబంధంలో బీటలు వారినట్టు తెలుసుకునేదెలా? ఈ ప్రశ్నకు ఇప్పుడు అమీర్ ఖాన్ తన జీవితానుభవం నుంచి చెప్పుకొచ్చిన ఒక విషయం క్లారిటీనిస్తోంది.
ఓసారి తన మాజీ భార్య కిరణ్ రావుతో వచ్చిన ఇష్యూ గురించి అమీర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఆమెతో ఏవో మనస్ఫర్థలు వచ్చాయి. దాంతో తాను మాట్లాడటం మానేసాడు. ఒకరోజు కాదు.. రెండు రోజులు.. కాదు నాలుగు రోజులు తనతో మాట్లాడలేదు. తను మాట్లాడటానికి ప్రయత్నించేది. కానీ తాను మాత్రం దిగి రాలేదు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. చాలా ఆవేదన చెందింది. ఇద్దరి మధ్యా మాటలు లేకపోయేసరికి చాలా గ్యాప్ వచ్చిందని అమీర్ ఖాన్ అంగీకరించాడు.
మానసిక నిపుణుల ప్రకారం.. భార్యా భర్తల మధ్య ఏదైనా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. సరిగా కమ్యూనికేట్ చేయకపోతే స్ఫర్థలు మరింత ముదురుతాయే కానీ తగ్గవు. ఇద్దరి మధ్యా సమస్య ఏమిటో మాట్లాడి పరిష్కరించుకోవాలి. అప్పుడే దాని నుంచి బయటపడగలరు. కానీ కిరణ్ రావు విషయంలో అమీర్ ఖాన్ అలా చేయలేదు. రోజుల తరబడి మాట్లాడకుండా దూరంగా ఉండిపోయాడు. తనకు కోపం వస్తే తన చుట్టూ షట్టర్స్ మూసివేసినట్టే భావిస్తానని కూడా అమీర్ నిజాయితీగా అంగీకరించాడు. కారణం ఏదైనా కానీ కిరణ్ రావుతో వచ్చిన చికాకు విషయంలో తనకు క్షమాభిక్ష పెట్టలేదు అమీర్. చివరకు ఈ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే 60 ఏళ్ల అమీర్ ఖాన్ మూడోసారి ప్రేమలో పడ్డాడు. బెంగళూరు యువతి గౌరి స్ప్రాట్ తో అతడు తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
