స్టార్ ను ఎలా అయ్యానో తెలియదు
ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆమిర్ ఖాన్ తన కెరీర్లో ఎన్నో సినిమాలతో డిఫరెంట్ డిఫరెంట్ ప్రయోగాలు చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 29 Nov 2025 1:58 PM ISTఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆమిర్ ఖాన్ తన కెరీర్లో ఎన్నో సినిమాలతో డిఫరెంట్ డిఫరెంట్ ప్రయోగాలు చేశారు. ఆయన సినిమాల ఎంపిక మొదట్నుంచి కూడా చాలా కొత్తగా ఉండేది. అయితే ఆ ప్రయోగాల్లో కొన్ని సినిమాలు హిట్లుగా నిలిస్తే, మరికొన్ని మాత్రం బెడిసికొట్టాయి. అయినప్పటికీ ఆమిర్ ప్రయోగాలు చేయడం మానలేదు.
ఎన్నో రిస్క్‌లు తీసుకున్నా
రీసెంట్ గా 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ కు హాజరైన ఆమిర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా, ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను స్టార్‌డమ్ విషయంలో, సినిమాల సెలక్షన్ విషయంలో, తన కెరీర్ లో తీసుకున్న రిస్క్‌ల గురించి మాట్లాడారు. తానెలా స్టార్ ఎలా అయ్యానో తనకే తెలియదని, స్టార్‌డమ్ కు కావాల్సిన రూల్స్ ను తాను చాలా సార్లు బ్రేక్ చేశానని చెప్పారు.
తాను లగాన్, సర్పరోష్, తారే జమీన్ పర్ లాంటి ఎన్నో ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ ను చేశానని, వాటిని ఆడియన్స్ ఆదరిస్తారా లేదా తనకప్పుడు తెలియదని సోషల్ మెసేజ్ తో సినిమాలు చేయడం తనకు ఇష్టముండదని, అలా చేయడానికి తానేమీ కార్యకర్తను కాదని, మొదటి నుంచి కూడా తనకు కథలు చెప్పడమంటే ఇష్టమని, తన సినిమాల్లో ఏదైనా మెసేజ్ ఉన్నా అది కాకతాళీయమేనని చెప్పారు.
థియేటర్లకు వచ్చేది పాఠాలు వినడానికి కాదు
ఆడియన్స్ థియేటర్లకు వచ్చేది పాఠాలు నేర్చుకోవడానికి కాదని, వాళ్లు థియేటర్లకు వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసమేనని, తన బాధ్యత ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమేనని, తన మొదటి టార్గెట్ వినోదమేనని, ట్రెండ్ చూసి సినిమాలు చేయడం తనకు అలవాటు లేదని, అప్పట్లో గజినీ మూవీ చేసేటప్పుడు చాలా మంది తనకు ఆ మూవీ చేయొద్దని చెప్పారని, యాక్షన్ సినిమాలు ట్రెండ్ కాదన్నారని, కానీ ఆ మూవీ రిలీజయ్యాక యాక్షన్ కూడా ఫ్యాషన్ అయిపోయిందని చెప్పారు. గత కొన్నాళ్లుగా నిర్మాణంపై ఫోకస్ చేయడంతో నటుడిగా ఎక్కువ ఫోకస్ చేయలేకపోయానని, ఇకపై నిర్మాణంపై కాకుండా యాక్టింగ్ పైనే ఫోకస్ చేయనున్నట్టు ఆమిర్ తెలిపారు.
