Begin typing your search above and press return to search.

దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.. వేడుకుంటున్న అమీర్ ఖాన్ ప్రేయసి!

అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తర్వాత కాలంలో దర్శకుడు, నిర్మాతగా కూడా పేరు దక్కించుకున్నారు.

By:  Madhu Reddy   |   26 Sept 2025 12:05 AM IST
దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.. వేడుకుంటున్న అమీర్ ఖాన్ ప్రేయసి!
X

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. ఈ మధ్య భాషతో సంబంధం లేకుండా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలో గెస్ట్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే అమీర్ ఖాన్ తన సినిమాలతో ఎలా అయితే వార్తల్లో నిలుస్తున్నారో ఇటు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా అంతే వార్తల్లో నిలుస్తున్నారు అని చెప్పాలి.

ఆరు పదుల వయసులో కూడా కొత్త రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ.. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అలా తన బర్తడే సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ తన ప్రియురాలిని పరిచయం చేశారు. బెంగళూరుకి చెందిన గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ లో ఉన్నానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ వయసులో ప్రేమలో పడడం ఏంటి? అంటూ అందరూ పలు రకాల కామెంట్లు చేశారు. తర్వాత వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లలో జంటగా కనిపించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ప్రేయసి కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తాజాగా ముంబైలోని బాంద్రాలో కనిపించారు. ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కొంతమంది ఫోటోగ్రాఫర్లు వెంటపడ్డారు. దాంతో అసహనానికి గురైన గౌరీ వెంటనే రియాక్ట్ అవుతూ.." దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను వాకింగ్ కి వెళ్తున్నాను. ఇలా వెంటపడి ఫోటోలు తీయడం ఆపండి" అంటూ అసహనం వ్యక్తం చేసింది గౌరీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కూడా ఫోటోగ్రాఫర్లపై మండిపడుతున్నారు. సెలబ్రిటీలను ఇలా రోడ్లపై వేధించడం ఏమాత్రం సరికాదు అంటూ చెబుతూ ఉండడం గమనార్హం.

అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తర్వాత కాలంలో దర్శకుడు, నిర్మాతగా కూడా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా సినీ రంగంలో అత్యంత ప్రతిభావంతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు నాలుగు నేషనల్ అవార్డులతో పాటు ఏడు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఈయన భారత ప్రభుత్వం చేత.. 2003లో పద్మశ్రీ, 2017లో పద్మ భూషణ్ పురస్కారాలు అందుకున్నారు.

అమీర్ ఖాన్ నటనా విషయానికి వస్తే.. 1973లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక, 2002లో ఆమెకు విడాకులు ఇచ్చి... 2015లో కిరణ్ రావు ను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ తో రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించారు.