ఆ విషయంలో అమీర్ ఖాన్ నిర్మాతకే ఓటు!
సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నది ఎంతగా పెరిగిపోయిందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 14 Sept 2025 4:00 PM ISTసినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నది ఎంతగా పెరిగిపోయిందన్నది చెప్పాల్సిన పనిలేదు. నిత్యం దీనిపై నిర్మాతల మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎంత తగ్గించాలన్నా ఖర్చు అంతకంతకు పెరిగిపోవడం తప్ప ఖర్చును మాత్రం అదుపు చేయడం సాద్యం కాలేదు. వీటిలో ప్రధానంగా నిత్యం తెరపైకి వచ్చేది హీరోయిన్లు.. వాళ్ల అసిస్టెంట్లు తో అదనపు భారమన్నది నిర్మాతకు ఇబ్బంది కరంగా మారుతుందని చాలా ఆరోపణలున్నాయి.
అలాగే కొంత మంది స్టార్ హీరోల వల్ల కూడా నిర్మాతలకు అదనంగా బడ్జెట్ ఖర్చు అవుతుందన్నది అంతే వాస్తవం. హీరోతో పాటు అతడి వెంట ఉన్న వారి ఖర్చు కూడా నిర్మాత నెత్తిన పడుతుందని... ఈ విషయంలో హీరోలు మారాలనే సంకేతా లు పంపించినా ఆ పద్దతితో ఇప్పటికీ మార్పు లేదన్నది కొంత మందినిర్మాతల అభిప్రాయం. ఆ మధ్య పూజాహెగ్డే ఓ తమిళ సినిమా విషయంలో అదనంగా తన స్టాప్ ను తీసుకెళ్లి నిర్మాత లతో ఖర్చు చేయించిందని వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ వివాదం నిర్మాతల సంఘం దృష్టికి సైతం వెళ్లింది. తాజాగా ఇలాంటి అంశాలపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. ఇండ స్ట్రీలో తన ధోరణి ఎలా ఉంటుందన్నది చెప్పే ప్రయత్నం చేసారు.
`ఏ సినిమాకైనా నిర్మాత అవసరమైనంతే ఖర్చు చేయాలి. మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమ్ పర్సన్ కు అతనే చెల్లించాలి. సినిమాలో భాగంగా మిగతా ఎవరికీ నిర్మాత చెల్లించాల్సిన పనిలేదు. నా కారు డ్రైవ ర్ కి...నా వెంట వచ్చిన వారికి నిర్మాత ఎందుకు ఖర్చు చేయాలి? వారంతా నా కోసం పని చేస్తారు. వారి కోసం నా జేబులో డబ్బులు ఖర్చు చేయాలి తప్ప నిర్మాత జేబు నుంచి తీయచడం ఏంటి? ఒకప్పుడు కారు డ్రైవర్, స్పాట్ బోయ్ ని కవర్ చేయడం సాధరణమైన విషయమే.
అయినప్పటికీ ఇప్పుడా పద్దతి నుంచి తప్పుకున్నాను. ఇప్పుడు నేను చాలా స్వతంత్రంగా ఉన్నాను.నిర్మాతలు నా వ్యక్తిగత సిబ్బంది ఎవరికీ డబ్బులు చెల్లించొద్దని ముందే చెబుతాను. నిర్మాతలు నటుడు డ్రైవర్ కి చెల్లిస్తారు. టీ , కాఫీ తెచ్చే అబ్బాయి వ్యక్తిగత వంటవాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంత మంది స్టార్లు వంట వ్యాన్...జిమ్ వ్యాన్ సెట్ చేయడానికి తీసుకొస్తారు. నిర్మాతలు వాళ్లకు చెల్లిస్తారు. అయినా ఒక స్లార్ కోట్లలో సంపాదించినప్పుడు తన సిబ్బందికి తాను చెల్లించాలి? తప్ప నిర్మాత ఎందుకు ఇవ్వాలి? అని నేను అడుగుతాను.
నా దృష్టిలో నిర్మాత ఎప్పుడూ కేవలం నిర్మాణంతో ముడిపడి ఉన్న ఖర్చులను మాత్రమే భరించాలి. మిగతా వాటితో ఆయనకు ఎంత మాత్రం సంబధం ఉండదనే భావిస్తాను. రెజ్లింగ్ పై ట్రైనింగ్ నాకు నిర్మాత డబ్బుతోనే శిక్షణ ఇచ్చారు. అది అక్కడికే పరిమితం. ఆ సమయంలో నా వెంట నేను తెచ్చుకున్న స్టాప్ ఎంత మంది ఉన్నా? ఆఖర్చులన్నీ నేనే భరిస్తాను. కొంత మంది స్టార్లు మాత్రం ఆ ఇమేజ్ ను నిర్మాత పై వేసి జేబులు ఖాళీ చేయిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
