Begin typing your search above and press return to search.

తమ్ముడిని బంధించిన అమీర్ ఖాన్.. ట్రోల్స్ పై స్పందించిన కుటుంబం!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై గత రెండు రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   11 Aug 2025 12:52 PM IST
తమ్ముడిని బంధించిన అమీర్ ఖాన్.. ట్రోల్స్ పై స్పందించిన కుటుంబం!
X

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై గత రెండు రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆయన తమ్ముడు ప్రముఖ నటుడు ఫైసల్ ఖాన్ చేసిన ఆరోపణలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా తన అన్నయ్య అమీర్ ఖాన్ తనను ఏడాది పాటు రూమ్ లో బంధించాడని, బయట సెక్యూరిటీని కాపలాగా పెట్టాడు అని ఫైసల్ ఖాన్ ఆరోపించగా.. ఈ విషయం కాస్త నెట్టింట హైలెట్ అవడంతో తొలిసారి అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఈ విషయంపై స్పందించారు. ఇది తమ పూర్తి వ్యక్తిగత విషయమని.. దీనిని హైలెట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.

దీనిపై అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఒక నోట్ కూడా విడుదల చేశారు. ఇక అందులో ఏముందనే విషయానికి వస్తే.. "ఫైసల్ ఖాన్ కు సంబంధించి ప్రతి నిర్ణయం కూడా మేము కలిసి తీసుకున్నాము. ఎంతో మంది డాక్టర్లను సంప్రదించి అతడికి వైద్యం కూడా అందించాము. ప్రతిసారి అతడి శ్రేయస్సు కోసమే ఆలోచించాము. మా కుటుంబ విషయం కావడంతో ఇప్పటివరకు మేము స్పందించలేదు. అతడి గురించి ఎక్కడ మాట్లాడకుండా గోప్యత పాటించాము. దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు. దీన్ని అసభ్యకరంగా చూపొద్దు. దీనిపై రెచ్చగొట్టే విధంగా మా కుటుంబం బాధపడే విధంగా కథనాలు రాయకండి. ఇది మా కుటుంబ విషయం. కాబట్టి దీనిని మీరు గాసిప్ లా మార్చాల్సిన అవసరం లేదు" అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఇలాంటి నోట్ విడుదల చేయడానికి అసలు కారణం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైసల్ ఖాన్.. అమీర్ ఖాన్ పై చేసిన కామెంట్లే కారణంగా వెలువడిన వార్తలే అని చెప్పుకోవచ్చు. అందులో ఫైసల్ ఖాన్ మాట్లాడుతూ.." నాకు పిచ్చి పట్టింది అని, నేను పిచ్చివాడిని అని, సమాజానికి హాని చేస్తానని ఏవేవో అన్నారు. కొన్ని విషయాల్లో నా కుటుంబమే నాకు సహకరించలేదు. నన్ను పిచ్చివాడిలా చూశారు. ఉచ్చులో కూరుకుపోయానని అర్థమైంది. ఆ తర్వాత ఎలా బయటపడాలో అర్థం కాలేదు. సంవత్సరం పాటు అమీర్ ఖాన్ నన్ను గదిలో బంధించాడు. ఫోన్ లాగేసుకున్నాడు. బయటకు వెళ్లకుండా బాడీగార్డ్లను పెట్టాడు. రోజు మందులు కూడా ఇచ్చేవారు" అంటూ కామెంట్ చేశారు. ఇక దీంతో చాలామంది అమీర్ ఖాన్ పై మండిపడ్డారు. సొంత తమ్ముడిని ఇలా గదిలో బంధించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇలా నెగిటివ్ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అమీర్ ఖాన్ కుటుంబం ఈ వార్తలకు చెక్ పెట్టేలా స్పందిస్తూ కామెంట్లు చేసింది.

అమీర్ ఖాన్ విషయానికి వస్తే.. సితారే జమీన్ పర్ అనే సినిమాతో తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. రూ.122 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించారు.