Begin typing your search above and press return to search.

గుస‌గుస‌: ముగ్గురు భార్యలతో స్టార్ హీరో నేర్పు ఓర్పు చాణ‌క్యం!

అలాంటిది విడాకులు ఇచ్చిన ఇద్దరు మాజీ భార్యలు, త్వరలో పెళ్లాడబోతున్న కాబోయే భార్య.. ముగ్గురినీ ఒకే కారులో కూర్చోబెట్టి ప్రయాణించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.

By:  Sivaji Kontham   |   17 Jun 2026 1:27 PM IST
గుస‌గుస‌: ముగ్గురు భార్యలతో స్టార్ హీరో నేర్పు ఓర్పు చాణ‌క్యం!
X

సాధారణంగా ఒకే చోట‌ ఇద్దరు భార్యలు ఉంటేనే ఆ సంసారం సజావుగా సాగడం కష్టమంటారు. అలాంటిది విడాకులు ఇచ్చిన ఇద్దరు మాజీ భార్యలు, త్వరలో పెళ్లాడబోతున్న కాబోయే భార్య.. ముగ్గురినీ ఒకే కారులో కూర్చోబెట్టి ప్రయాణించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కొందరి ఇళ్లలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే కత్తులు దూసుకుని మారణహోమం జరుగుతుంది. కానీ బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ విషయంలో ఇది సాధ్యమైంది. తన మొదటి భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావు, కొత్త గర్ల్‌ఫ్రెండ్ (కాబోయే మూడో భార్య) గౌరి స్ప్రాట్ లతో కలిసి ఆయన ఒకే కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు సాషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది అమీర్ ఖాన్ `లవ్ పవర్`, ఆయనకున్న అసాధారణ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అని కొంద‌రు ప్రశంసిస్తున్నారు. అమీర్ ఖాన్ తన మునుపటి భార్యలకు విడాకులు ఇచ్చే సమయంలోనే న్యాయబద్ధంగా ఆస్తుల పంపకాలు పూర్తి చేసి..ఎలాంటి తగాదాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. వార‌సుల కెరీర్ ని చ‌క్క‌దిద్దుతున్నారు. వారి పెళ్లిళ్ల బాధ్య‌త‌ల్ని మాజీల‌తో క‌లిసి ద‌గ్గ‌రుండి చూస్తున్నారు. అందుకే ఆయన మూడో పెళ్లికి సిద్ధమవుతున్నా.. పాత భార్యలు ఇద్దరూ ఆయనపై ఎలాంటి అసంతృప్తి చూపడం లేదు. వారంతా ఎంతో మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తూ అమీర్ నిర్ణయాలను గౌరవిస్తున్నారు.

అమీర్ ఖాన్ తన కుటుంబం అనే పడవను ఎంతో చాణక్యంతో నడిపిస్తున్నారు. భార్యలను, కుటుంబ సభ్యులను ఎలా బ్యాలెన్స్ చేయాలో చాణక్యుడి నీతులను ఆయన బాగా వంటబట్టించుకున్నట్లున్నారు. తాను ప్రేమించిన గౌరి స్ప్రాట్‌ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్న ఈ టైమ్ లో మొదటి ఇద్దరు భార్యలను కూడా కలుపుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. త్వరలో జరగనున్న‌ ఈ మూడో పెళ్లి వేడుకకు అమీర్ ఖాన్ ముగ్గురు భార్యల పిల్లలు (జునైద్, ఐరా, ఆజాద్, గౌరి వార‌సులు) కూడా హాజరవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే... అమీర్ ఖాన్ గత కొంతకాలంగా హీరోగా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించలేదు. నటుడిగా కాస్త విరామం తీసుకున్నా.. నిర్మాతగా బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై `లాహోర్, 1947` అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.

నిర్మాతగా బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత.. 2026లో అమీర్ ఖాన్ మళ్లీ నటుడిగా వెండితెరపై సందడి చేయనున్నారు. 2026లో ఆయన నటించే తదుపరి చిత్రాల కోసం స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్పెయిన్ హిట్ మూవీ `కంపెసియోనెస్` ఆధారంగా `సితారే జమీన్ పర్` సీక్వెల్ తీసి విమ‌ర్శ‌కుల ప్రశంస‌లు అందుకున్నాడు. కానీ ఇప్పుడు అత‌డు సోలోగా న‌టించే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ కోసం అభిమానులు క‌ళ్లుకాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ముగ్గురు భార్యలను బ్యాలెన్స్ చేస్తూ, మరోవైపు నిర్మాతగా, నటుడిగా భిన్నమైన సినిమాలతో 2026లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి అమీర్ ఖాన్ సిద్ధమవుతున్నారు.