సినిమా చూస్తూనే మొబైల్ చూస్తున్నారు..టాప్ హీరో ఆవేదన!
నేటి ప్రజలు ఎంతగా మారారు అంటే... ఒకప్పటితో పోల్చి చూస్తే, ఇప్పుడు వేరు.. అంతా మల్టీటాస్కింగ్. ``ఓ వైపు థియేటర్ లో సినిమాలు చూస్తూనే, మొబైల్ చూస్తుంటారు. మెసేజ్ లకు రిప్లై ఇస్తుంటారు.
By: Sivaji Kontham | 21 Sept 2025 10:28 PM ISTనేటి ప్రజలు ఎంతగా మారారు అంటే... ఒకప్పటితో పోల్చి చూస్తే, ఇప్పుడు వేరు.. అంతా మల్టీటాస్కింగ్. ``ఓ వైపు థియేటర్ లో సినిమాలు చూస్తూనే, మొబైల్ చూస్తుంటారు. మెసేజ్ లకు రిప్లై ఇస్తుంటారు. వాట్సాపులు, సోషల్ మీడియాల్లో స్టాటస్ కూడా చెక్ చేస్తుంటారు. ఈరోజుల్లో ప్రజలకు సినిమాలు చూసే శ్రద్ధ ఇలా ఉంది`` అని ఆవేదన చెందాడు ప్రముఖ నటుడు, నిర్మాత అమీర్ ఖాన్.
థియేటర్ లో ఓ వైపు సినిమా చూస్తుంటే, మధ్యలో పాప్ కార్న్, సమోసాలు సర్వ్ చేస్తుంటారు. ప్రేక్షకుల మధ్య థియేటర్ సిబ్బంది అటూ ఇటూ తిరుగుతుంటారని కూడా అమీర్ ఖాన్ అన్నారు. దయచేసి సినిమా చూసేప్పుడు చూడనివ్వండి. మధ్యలో డిస్ట్రబ్ చేయొద్దు. ఫుడ్ ని మధ్యలో వచ్చి సర్వ్ చేయొద్దు. సమోసా, స్నాక్స్ తినడానికి నేను వ్యతిరేకిని కాను. నేను కూడా ఆస్వాధిస్తాను. కానీ సినిమా ప్రారంభం కాక ముందు, విరామ సమయంలో మాత్రమే వాటిని కొనేందుకు బయటకు వెళతాను అని చెప్పారు అమీర్.
దీనిని బట్టి స్క్రీన్ మీద సినిమా వీక్షణలో నిమగ్నమయ్యేలా ప్రేక్షకుల్ని సిద్ధం చేయాల్సిన అవసరం థియేటర్ యాజమాన్యానికి కూడా ఉంది. కానీ వారు అలా చేయరు. ఒకప్పుడు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోతే థియేటర్ వదిలి వెళ్లిపోయేవారు. కానీ ఇప్పటి ప్రజలకు అంతగా ఓపిక లేదు. సినిమా చూస్తూనే మొబైల్ చూస్తుంటారని కూడా అమీర్ తన ఆవేదనను దాచుకోలేకపోయారు. మారుతున్న జీవన శైలి కూడా సినిమాల ఆదరణ తగ్గడానికి కారణమవుతోందని గమనించినట్టు చెప్పాడు.
మల్టీప్లెక్సుల్లో కోక్ - పాప్ కార్న్, సమోసా వ్యాపారం నిజానికి సినిమా టికెట్ ని మించిన ఆదాయాన్ని అందిస్తున్నాయి. వినోద ప్రియులు సినిమా చూస్తే తినేందుకు ఇష్టపడుతున్నారని దీని అర్థం. అయితే ఇదే అనువుగా మల్టీప్లెక్సులు అడ్డగోలుగా చిరు తిండి రేట్లు పెంచి దోపిడీ చేస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. థియేటర్ ఫుడ్ ధరల విషయంలో యాజమాన్యాలు బాధ్యత వహించడం లేదని కూడా క్రిటిసిజం ఉంది.
