పెళ్లి అంటే పత్రాలపై రాసుకునేది కాదన్న స్టార్ హీరో
రెండుసార్లు విడాకులు అయ్యాక మూడో వ్యక్తితో సంబంధంలో ఉన్నపుడు ఎదురయ్యే విమర్శల్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు.
By: Sivaji Kontham | 26 Sept 2025 8:00 PM ISTరెండుసార్లు విడాకులు అయ్యాక మూడో వ్యక్తితో సంబంధంలో ఉన్నపుడు ఎదురయ్యే విమర్శల్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు. తన చుట్టూ ఉన్న సమాజం అతడిని స్క్రుటిని చేస్తుంది. కానీ అన్నిటినీ తన సమయస్ఫూర్తి, విచక్షణ, నిజాయితీతో ఎదుర్కొంటున్నాడు అమీర్ ఖాన్.
ఇప్పుడు `టూమచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్` కార్యక్రమంలో అమీర్ ఖాన్ చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా అతడి మాటల్లో నిజాయితీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రీనాదత్తా, కిరణ్ రావులకు విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ ప్రస్తుతం బెంగళూరు యువతి గౌరీ స్ప్రాట్ తో సంబంధంలో ఉన్న సంగతి తెలిసిందే. గౌరీని అతడు ఇంకా పెళ్లాడలేదు. దీంతో అతడికి ప్రతిసారీ పెళ్లి గురించిన ప్రశ్న ఎదురవుతోంది.
60 ఏళ్ల అమీర్ ఖాన్ ఇప్పుడు అలాంటి ప్రశ్నలకు సమాధానంతో సిద్ధంగా ఉన్నాడు. రీనా, కిరణ్ ల నుంచి విడిపోవడం బాధాకరమైనదని షోలో హోస్టుల ముందు అతడు అంగీకరించాడు. కానీ మాజీలతో ఆ పరిస్థితుల్లో ముందుకు సాగడం కష్టమని ఒప్పుకున్నాడు. విడిపోయినా వారు నా కుటుంబంలో భాగం అని చెప్పాడు. వారు అద్భుతమైన వ్యక్తులు అంటూ కితాబిచ్చాడు.
పెళ్లి అంటే పేపర్లపై సంతకం కాదు.. ఇద్దరు కనెక్టయి ఉండటం అని తన అనుభవాన్ని వివరించాడు. ఒక వ్యక్తితో కనెక్ట్ అయి ఉంటే అది పెళ్లి లాంటిదేనని అన్నాడు. బంధంలో నిబద్ధత చాలా అవసరమని, పెళ్లితో పని లేకున్నా నిబద్ధతతో బంధం కొనసాగించడం అర్థవంతమైనదని అన్నాడు. ప్రేమ గుడ్డిది కానీ వివాహం భూతద్దం లాంటిది! అంటూ ట్వింకిల్ మాట కలిపారు.
అంతేకాదు.. విడిపోవడంలో కూడా ఎదగడానికి చాలా నేర్చుకోవచ్చని కూడా అమీర్ ఖాన్ అన్నాడు. ప్రతిదీ నేర్చుకుంటామని తెలిపాడు. పెళ్లి కంటే అవగాహన, నిబద్ధతల ప్రాముఖ్యతను అతడు ఎక్కువగా హైలైట్ చేసాడు. అంతేకాదు 60 ప్లస్ లో కూడా అతడు ప్రేమలో పడటాన్ని సమర్థించుకున్నాడు. గౌరీతో సంబంధం నిబద్థతతో కొనసాగిస్తున్నట్టు వెల్లడించాడు. `టూమచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్` కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
లాల్ సింగ్ చడ్డా, సీతారే జమీన్ పార్ తర్వాత అమీర్ ఖాన్ నటించే సినిమా గురించి ప్రకటన వెలువడాల్సి ఉంది. రజనీకాంత్ కూలీలో అతిథి పాత్ర అతడికి అంతగా సంతృప్తినివ్వలేదు. తదుపరి సల్మాన్, షారూఖ్ తో కలిసి ఓ చిత్రంలో నటించాలనుందని కూడా అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు దాదాసాహెబ్ ఫాల్కే జీవితకథతో బయోపిక్ చిత్రాన్ని నిర్మించేందుకు అమీర్ సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో తన రచయితల బృందంతో కలిసి మహాభారతం స్క్రిప్టు పనుల్ని కొనసాగిస్తున్నాడు.
