అట్లీ తో అమీర్ ఖాన్ చర్చలు!
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సరైన కమర్షియల్ హిట్ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 6 Aug 2026 4:04 PM ISTబాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సరైన కమర్షియల్ హిట్ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా? బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలను అందుకో లేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమీర్ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టేందుకు ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. దీనికోసం టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్ల వైపు అడుగులు వేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ అట్లీతో అమీర్ ఖాన్ సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
షారుఖ్ ఖాన్ కి `జవాన్` వంటి సంచలన బ్లాక్‌బస్టర్ అందించిన అట్లీ బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. కమర్షియల్ హంగులతో పాటు బలమైన భావోద్వేగాలను మిళితం చేసి సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన అట్లీతో కలిసి పని చేయడానికి అమీర్ ఖాన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్ జరిగినట్లు బీటౌన్ మీడియా కోడైకూస్తోంది. అమీర్ ఖాన్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా మాస్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ కథను అట్లీ వినిపించాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాలిస్తే ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై అరుదైన కలయిక అవుతుంది. అమీర్ ఖాన్ కథల ఎంపికలో ఎంతటి కఠినంగా ఉంటారో తెలిసిందే. స్క్రిప్ట్ విషయంలో ప్రతీ చిన్న అంశాన్ని బేరీజు వేసుకుంటారు. ప్రస్తుతానికి అట్లీ చెప్పిన లైన్ పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వస్తే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. అయితే అందుకు చాలా సమయం పడుతుంది. బహుశా అధికారిక ప్రకటన వచ్చే ఏడాది వరకూ వచ్చే అవకాశం లేదు.
ప్రస్తుతం అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా `రాకా` అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వందల కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న చిత్రమిది. దీంతో అట్లీ ఎంతో ఏకాగ్రతతో పని చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. అంటే అప్పటి వరకూ అట్లీ ఈ సినిమాపైనే బిజీగా ఉంటాడు. కానీ షూటింగ్ అంతా ఓ కొలిక్కి వస్తే గనుక తదుపరి చిత్రాల లైనప్ మాత్రం లీక్ అవుతుంది. ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ ప్రాజెక్ట్ వివరాలు కూడా లీకైనట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అమీర్ ఖాన్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. కానీ రాజమౌళి టాలీవుడ్ హీరోలకే కట్టుబడి ఉండటంతో? సాధ్యపడలేదు. అయినా ఏదో రోజు కచ్చితంగా అమీర్-రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుంది.
