ఫాల్కే బయోపిక్ అదంతా గాలి ప్రచారం!
ఇటీవలే అమీర్ ఖాన్ కు హిరాణీ పూర్తి స్టోరీ నేరేట్ చేసారుట. కానీ ఈ నేరేషన్ తో అమీర్ ఖాన్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదట.
By: Srikanth Kontham | 18 Sept 2025 12:00 AM ISTఅమీర్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. `త్రీ ఇడియట్స్`, `పీకే` లాంటి విజయాలు అనంతరం ఈ ద్వయం హ్యాట్రిక్ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కి సంలకల్పించారు. అధికారికంగా ప్రాజెక్ట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమవుదుం దని నిన్న మొన్నటి వరకూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఓ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
ఇటీవలే అమీర్ ఖాన్ కు హిరాణీ పూర్తి స్టోరీ నేరేట్ చేసారుట. కానీ ఈ నేరేషన్ తో అమీర్ ఖాన్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదట. స్టోరీ విషయంలో ఎన్నో సందేహాలు వ్యక్తం చేసారుట. దీంతో మరోసారి ఇద్దరు కలుద్దామని అమీర్ డైరెక్టర్ తో చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. అయినా స్టోరీ లాక్ అవ్వకుండా ఏ కాంబినేషన్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించదు.అందులోనూ బాలీవుడ్ ఎంతో ప్రీ ప్లాన్డ్ గా ఉంటుంది. స్టోరీ లాక్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు.
అటుపై వర్క్ షాపులకు వెళ్తారు. ఒకవేళ స్క్రిప్ట్ పరంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎవైనా తలెత్తినా అలాంటివన్నీ నేరేషన్ సమయంలోనే క్లియర్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లాలా? రద్దు చేయాలా? అన్నది అప్పుడే డిసైడ్ అవుతుంది. రాజ్ కుమార్ హిరాణీ స్క్రిప్ట్ సిద్దం చేసుకోవడం కోసమే సంవత్సరాలు సమయం కేటాయిస్తారు. అన్ని క్లియర్ గా ఉన్న తర్వాతే ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారు. ఆయన డైరెక్టర్ గా పని చేయడం కంటే రైటర్ గానే ఎక్కువ సినిమాలకు పని చేసారు.
డైరెక్టర్ గా కేవలం ఆరు సినిమాలకు మాత్రమే పనిచేసారు. అలా చేసిన ఆరు భారీ విజయాలు సాధించినవే. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రలు సృష్టించిన చిత్రాలే. రైటర్ గానూ ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు సేవలందించారు. అలాంటి రైటర్ కం డైరెక్టర్ స్టోరీ విషయంలో అమీర్ ఖాన్ అసంతృప్తి చెందడం? అన్నది గాలి ప్రచారంగానే కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు భావిస్తున్నాయి. రాజ్ కుమార్ హిరాణీ చివరిగా `డంకీ` చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హిరాణీ నుంచి అధికారిక ప్రనటనొచ్చింది ఫాల్కే ప్రాజెక్ట్ మాత్రమే.
