అందాల ఆమని స్టార్ హీరోలకు దూరంగా!
90లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమని.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోవడం లేదు. చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ప్రాజెక్టుల్లో సహాయక పాత్రలకే పరిమితమవుతున్నారు. టైప్ క్యాస్టింగ్ కారణంగా ఆమె ప్రతిభకు తగిన పాత్రలు దక్కడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సీరియళ్లలోనూ నటిస్తున్నారు.
By: Srikanth Kontham | 12 Nov 2026 4:00 AM IST90ల కాలంలో తనదైన సహజ నటన.. హోమ్లీ లుక్స్.. తిరుగులేని చార్మ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అగ్ర కథానాయికలలో ఆమని ఒకరు. `శుభలగ్నం`, `శుభసంకల్పం`, `మిస్టర్ పెళ్ళాం`, `మావిచిగురు` వంటి విజయవంత మైన చిత్రాల్లో నటించి ఉత్తమ నటిగా నంది అవార్డులను అందుకుని ఓ వెలుగు వెలిగారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో ఒదిగిపోయిన ఆమని ఆ తరం స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక మైన ముద్ర వేసుకున్నారు. అయితే వివాహానంతరం కెరీర్ పరంగా కొంత గ్యాప్ వచ్చింది.
పూర్తిగా సినిమాలకు దూరం కాలేదు కానీ వివిధ కారణాలతో వెండి తెరకు దూరమయ్యారు. అయితే మళ్లీ ఆమని సెకెండ్ ఇన్నింగ్స్ ను మళ్లీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా జర్నీలో వెటరన్ నటికి ఆశించిన స్థాయిలో మంచి అవకాశాలు రావడం లేదు. ఆమె ట్యాలెంట్ కు తగ్గ ఛాన్సులు వస్తున్నట్లు కనిపించలేదు. చిన్న సినిమాలు.. లో-బడ్జెట్ ప్రాజెక్ట్‌లు .. సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమవుతున్నారు. సీనియర్ నటిగా ఆమని నటన పట్ల ఉన్న తపన, పరిణతి ఇప్పటికీ తగ్గనప్పటికీ టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలలో సరైన డిమాండ్ కనిపించడం లేదు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటీమణులకు స్టార్ హీరోల సినిమాలలో తల్లి.. వదిన .. ప్రాధాన్యమున్న క్యారెక్టర్ రోల్స్ విరివిగా దక్కుతున్నాయి. కానీ ఆమనికి మాత్రం అగ్ర నిర్మాణ సంస్థలు ..బిగ్ లీగ్ డైరెక్టర్ల నుంచి పెద్దగా పిలుపు రాకపోవడం గమనార్హం. చిన్న సినిమాలలో తల్లి పాత్రలు .. ప్రాధాన్యమున్న సహాయ నటి పాత్రలు చేస్తున్నా? అవి పబ్లిసిటీ పరంగా ఆమని రేంజ్‌ను ఎలివేట్ చేసే స్థాయిలో ఉండటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం టాలీవుడ్ మేకర్స్ పాటించే టైప్ క్యాస్టింగ్ ..క్యారెక్టర్ రోల్స్ ఎంపిక శైలి అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రాధాన్యమున్న క్యారెక్టర్ రోల్స్ కోసం కొంతమంది సీనియర్ నటీమణులపైనే పదే పదే దృష్టి పెట్టడంతో ఆమని వంటి అవార్డు గ్రహీతల ప్రతిభకు సరిపడా ప్రాజెక్ట్‌లు దక్కడం లేదని తెలుస్తోంది. ఆమని స్థాయికి తగ్గ వైవిధ్యమైన.. బలమైన పాత్రలను డిజైన్ చేయడంలో కథకులు కూడా కొంత వెనకబడుతున్నారు. ఏదేమైనా అందాల ఆమనిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి ప్రతిభను టాలీవుడ్ స్టార్ మేకర్స్ ఉపయోగిం చుకోవాల్సిన అవసరం ఉంది. సరైన పాత్ర, బలమైన భావోద్వేగాలు ఉన్న ప్రాజెక్ట్ దక్కితే వెండితెరపై సీనియారిటీని, నటనను మరోసారి ఆమని నిరూపించుకోగలరన్నది కాదనలేని నిజం. ప్రస్తుతం ఆమని తెలుగు సీరియళ్లలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
