కరెక్షన్ టైమ్ ఇవ్వలేదంటోన్న సీనియర్ నటి!
సీన్ కరెక్షన్ కోసం ఎంత మాత్రం సమయం ఇవ్వకుండా రీటేక్ చెప్పడానికే చూస్తున్నారు? తప్ప ఆ సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అన్నది కనీసం డిస్కషన్ కుడా ఛాన్స్ ఇవ్వడం లేదన్నారు.
By: Srikanth Kontham | 29 Jan 2026 12:00 AM ISTటెక్నాలజీ పెరిగే కొద్ది పనిలో వేగం పెరిగినా? నాణ్యత తగ్గుతోంది అన్న దాంట్లో నిజం అంతే ఉంది. పాత తరం నటుల్లో సహజత్వం కనిపించేది. సినిమా సెట్స్ కు వెళ్లే ముందు రకరకాల రిహార్సల్స్ జరిగేవి. వర్క్ షాపులు నిర్వహించేవారు. పాత్రకు తగ్గట్టు కాస్ట్యూమ్స్...మ్యాకప్ అన్నీ పర్పెక్ట్ గా సెట్ అయ్యేవి. నటీనటులకు కొంత స్పేస్ ఉండేది. దర్శకులు అంతటి ప్రాధాన్యత వాళ్లకు ఇచ్చేవారు. తరాలు మారే కొద్ది అదే నటన ఆర్టిఫిషియల్ గా మారిపోయింది. నటీనటులకు ఇచ్చే ప్రాధాన్యత తగ్గింది. ఆ పాత్రకు ఫలానే నటే చేయాలని లేదు. ఎవరు అందుబాటులో వారు చేస్తున్నారు.
నటీనటులను అభ్యర్దించే పరిస్థితి అయితే అసలే లేదు. ఆ రకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటే తప్ప మేకర్స్ ఇప్పుడు నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాజాగా ఇదే అంశాన్ని సీనియర్ నటి ఆమని లేవనెత్తారు. ప్రస్తుత తరం దర్శకులంతా నటీనటులకు కెమెరా ముందు స్పేస్ ఇవ్వడం లేదన్నారు. సీన్ సరిగ్గా రాకపోతో వెంటనే రీటేక్ చెబుతున్నారు. అందులోనూ సరిగ్గా రాకపోతే ఎన్ని రీటేక్ లు చెప్పడానికైనా సిద్ద పడుతు న్నారు తప్ప కెమెరా ముందు నటి పరిస్థితి ఏంటి? అన్నది అర్దం చేసుకోలేకపోతున్నారు.
సీన్ కరెక్షన్ కోసం ఎంత మాత్రం సమయం ఇవ్వకుండా రీటేక్ చెప్పడానికే చూస్తున్నారు? తప్ప ఆ సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అన్నది కనీసం డిస్కషన్ కుడా ఛాన్స్ ఇవ్వడం లేదన్నారు. అలాగైతే సన్నివేశంలో సహజత్వం ఎలా వస్తుంది? పర్పెక్షన్ మిస్ అవ్వదు? అని క్వశ్చన్ చేస్తున్నారు. నటి సీన్ సరిగ్గా చేయని సమయంలో పాత డైరెక్టర్లు ఎలా చేయోలా సవ్యంగా తెలియజేసేవారన్నారు. కానీ ఇప్పటి దర్శకులం తా వాళ్ల హడావుడి వాళ్లది తప్ప! నటీనటుల నుంచి సరైన ఔట్ ఫుట్ తీసుకోలేకపోతున్నారన్నారు.
ఆమని హీరోయి న్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. నాగార్జున, వెంకటేష్, బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసారు. కానీ మెగాస్టార్ చిరంజీవి సరసన మాత్రం సినిమా చేయలేకపోయారు.చిరుతో నటించే అవకాశం ఓసారి వచ్చినా? బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ఛాన్స్ వదులుకున్నారు. ఆ తర్వాత మరో ఛాన్స్ రాలేదు. అప్పటి నుంచి చిరంజీవి సినిమాలో నటించాలి? అనే ఆమని కోరిక అలాగే మిగిలిపోయింది.ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. అయితే ఆమని ఇమేజ్ కు తగ్గ పాత్రలు మాత్రం రావడం లేదు. గత ఏడాది నాలుగైదు సినిమాల్లో నటించారు. కానీ ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలియదు. ప్రస్తుతం `వనవీర` అనే చిత్రంలో నటిస్తున్నారు.
