Begin typing your search above and press return to search.

స్పిరిట్ మూవీ కోసం టాప్ స్టైలిస్ట్.. అమ్మాయిలు తట్టుకుంటారా?

ప్రభాస్ ప్రస్తుతం వరుస లైనప్ తో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. కనీసం పెళ్లి చేసుకోవడానికి కూడా టైం లేనంతగా బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   31 Aug 2025 8:15 AM IST
స్పిరిట్ మూవీ కోసం టాప్ స్టైలిస్ట్.. అమ్మాయిలు తట్టుకుంటారా?
X

ప్రభాస్ ప్రస్తుతం వరుస లైనప్ తో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. కనీసం పెళ్లి చేసుకోవడానికి కూడా టైం లేనంతగా బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నారు.అయితే అలాంటి ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్స్ అయిపోయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న స్పిరిట్ మూవీ గురించి తాజాగా ఒక అప్డేట్ అందుతోంది. అదేంటంటే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా కోసం టాప్ స్టైలిస్ట్ ని డైరెక్టర్ తీసుకోబోతున్నారట.

అయితే ఇప్పటివరకు ఆ స్టైలిస్ట్ ఎంతో మంది అగ్ర హీరోల దగ్గర వర్క్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ స్పిరిట్ సినిమాకి స్టైలిస్ట్ గా వర్క్ చేసేది ఎవరో ఇప్పుడు చూద్దాం..

ప్రభాస్ కోసం రంగంలోకి టాప్ హెయిర్ స్టైలిస్ట్..

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్రనటుల లుక్స్ ని డిజైన్ చేసిన ఆలిమ్ హకీమ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన టాప్ హెయిర్ స్టైలిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే అలాంటి ఆలిమ్ హకీమ్ త్వరలోనే ప్రభాస్ నటించబోతున్న స్పిరిట్ మూవీకి ప్రభాస్ లుక్ ని తీర్చిదిద్దబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆలిమ్ హకీమ్ ఇండియన్ స్టార్ హీరోస్ అయినటువంటి అల్లు అర్జున్,రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలకి స్టైలిస్ట్ గా వర్క్ చేశారట. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది..

డైరెక్టర్ తో మంచి అనుబంధం..

అటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ కి మంచి అనుబంధం ఉందట. ఎందుకంటే ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలకు ఆలిమ్ హకీమ్ స్టైలిష్ గా వర్క్ చేశారట. అలా తనకు సెంటిమెంట్ గా మారిన ఆలిమ్ హకీమ్ ని తన నెక్స్ట్ మూవీ కోసం కూడా సందీప్ రెడ్డి వంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా స్పిరిట్ మూవీలో ప్రభాస్ లుక్ ని ఆలిమ్ హకీమ్ డిజైన్ చేయబోతున్నారట. ఇక ఈ విషయం తెలిసి నెటిజన్స్ అసలే ప్రభాస్ అంటే పడి చచ్చే అమ్మాయిలు.. ఆయన హెయిర్ స్టైల్ కోసం ప్రత్యేకంగా ఫేమస్ స్టైలిస్ట్ ని రంగంలోకి దింపుతున్నారు అంటే ఇక ఆయన లుక్కుకి అమ్మాయిలు తట్టుకుంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

స్పిరిట్ సినిమా విశేషాలు..

స్పిరిట్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా.. త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని భద్రకాళి ఫిలిమ్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి రీసెంట్ గా కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటి వరకు చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. స్పిరిట్ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.