టీజర్ టాక్: దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'.. మరో హార్ట్ టచ్ జర్నీ..
ఎమోషనల్ సీన్స్, నేచురల్ యాక్టింగ్, అట్రాక్ట్ చేసే డైలాగ్స్ తో టీజర్ హైప్ పెంచుతోంది. సినిమాలో కల్పన అనే గ్రామీణ యువతి పాత్రలో సాత్విక వీరవల్లి కనిపిస్తోంది.
By: M Prashanth | 17 Oct 2026 12:07 PM ISTమాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్లో ఓ అమ్మాయి కలలు, వాటిని నిజం చేసుకునేందుకు ఆమె చేసే ప్రయత్నాలు, ఆ ప్రయాణంలో అండగా నిలిచే ఓ యువకుడి పాత్రను చూపించారు.
ఎమోషనల్ సీన్స్, నేచురల్ యాక్టింగ్, అట్రాక్ట్ చేసే డైలాగ్స్ తో టీజర్ హైప్ పెంచుతోంది. సినిమాలో కల్పన అనే గ్రామీణ యువతి పాత్రలో సాత్విక వీరవల్లి కనిపిస్తోంది. చదువులో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన ఆమెకు వ్యోమగామి కావాలనే టార్గెట్ ఉంటుంది. అయితే, ఆమె ఆశయాన్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకోరు. పైగా చదువు కొనసాగించేందుకు అడ్డంకులు ఎదురవుతాయి.
అలాంటి సమయంలో కృష్ణ పాత్రలో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ ఆమెకు అండగా నిలుస్తాడు. కల్పన చదువుకు సహాయం చేయడమే కాకుండా.. తన కలను నిజం చేసుకునేందుకు ఎంకరేజ్ చేస్తాడు. టీజర్ లో కల్పన రోల్ చెప్పే డైలాగ్స్ స్పెషల్ గా నిలుస్తున్నాయి. 'దాటుతాను సార్.. ఈ ఊరి పొలిమేర కాదు.. భూమి.. భూమి పొలిమేర దాటుతాను' అంటూ ఆమె చెప్పే డైలాగ్ తన టార్గెట్ పై ఉన్న డెడికేషన్ ను తెలియజేస్తోంది.
ఓ గ్రామంలో ఉంటూ అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనే అమ్మాయి ప్రయాణం ఎలా ఉండబోతోందనే ఇంట్రెస్ట్ ను ఆ సీన్ క్రియేట్ చేస్తోంది. ఇక కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ తన నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. 'నువ్వు కష్టపడి చదువుతానంటే నేను చదివిస్తాను.. కాలేజీకి వెళ్తావా?' అంటూ ఆయన చెప్పే డైలాగ్ కల్పనపై చూపించే కేరింగ్ ను క్లియర్ గా చెబుతున్నాయి. కల్పన కలను తన డ్రీమ్ గా భావించే వ్యక్తిగా కృష్ణ రోల్ కనిపిస్తోంది.
కొత్త నటి అయినప్పటికీ సాత్విక వీరవల్లి తన యాక్టింగ్ తో ఆకట్టుకుందని చెప్పాలి. కల్పన ఎదుర్కొనే ఇబ్బందులు, తన టార్గెట్ ను చేరుకోవాలనే తపనను ఆమె చక్కగా చూపించింది. మరోవైపు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ టీజర్ చివర్లో కనిపించి ఆకట్టుకున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లోని ఎమోషన్స్ కు స్త్రెంత్ గా నిలిచింది. విజువల్స్ కూడా కథకు తగ్గట్టుగా, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ఇక పవన్ సాదినేని ఆ కథను తెరపై ఎలా చూపించారో సినిమా విడుదలయ్యాక తెలియనుంది. సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్ తోపాటు స్వప్న సినిమా సంయుక్తంగా సమర్పిస్తుండగా, లైట్బాక్స్ మీడియా బ్యానర్పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఏదేమైనా టీజర్ తో సినిమా మరో హార్ట్ ఫుల్ టచ్ మూవీగా ఉండనుందని అర్థమవుతోంది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.
