Begin typing your search above and press return to search.

ఆకాశంలో 'ఈ' తారకి మంచి గుర్తింపు..!

‘ఆకాశంలో ఒక తార’ రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాలో కల్పన పాత్రతో సాత్విక వీరవల్లి ప్రశంసలు అందుకుంటుండగా, కొద్దిసేపే కనిపించిన రుహాని శర్మ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె నటనపై అల్లు అరవింద్, రాజమౌళి ప్రశంసలు కురిపించారు. దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగులో అవకాశం అందుకున్న రుహానికి ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది.

By:  Ramesh Palla   |   29 Nov 2026 4:00 PM IST
ఆకాశంలో ఈ తారకి మంచి గుర్తింపు..!
X

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అనడంలో సందేహం లేదు. మొదటి నుంచి ఈ సినిమా కోసం ఇండస్ట్రీ నుంచి పెద్దలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయినా కూడా మొదటి వారంలో టాక్‌ కి తగ్గట్లుగా వసూళ్లు రాలేదు. కానీ రెండో వారం నుంచి వసూళ్లు ఊపందుకున్నాయి. బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్‌ వీకెండ్‌లో వచ్చిన కలెక్షన్స్‌ మొదటి రోజు వసూళ్లకు దాదాపుగా రెట్టింపు ఉన్నాయట. రెండో వారం మొత్తం ఆకాశంలో ఒక తార సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జనాల నుంచి వచ్చిన మౌత్‌ టాక్ ఇప్పుడే ఎక్కువ అయింది, దాంతో వసూళ్లు కూడా పెరిగాయి. రెండో వారంతో పాటు మూడో వారంలోను ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేసే విధంగా ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

ఆకాశంలో ఒక తార సినిమాతో సాత్విక వీరవల్లి...

ఒక వైపు సినిమా వసూళ్ల పరంగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిస్తే మరో వైపు హీరోయిన్‌ సాత్విక వీరవల్లి వార్తల్లో నిలిచింది. ఈమెను సినిమా విడుదలకు ముందు నుంచే ఇండస్ట్రీ వర్గాల వారు పరిశీలిస్తూ వస్తున్నారు. సుకుమార్‌ ఏకంగా ఆమెను తన ఆర్‌సీ17 సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలో కచ్చితంగా సాత్విక వీరవల్లి పోషించిన కల్పన పాత్రకు ప్రశంసలు పొందాల్సిందే. ఆమెకు దక్కాల్సిన ప్రశంసలు పుష్కలంగా దక్కుతున్నాయి. అయితే ఇదే సమయంలో సినిమాలో మరో తార కూడా ఉంది. ఆమె రుహాని శర్మ. సినిమాలో ఈమె కనిపించింది కొద్ది సమయం అయినా కూడా మాట్లాడుకునే విధంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. రుహాని పాత్ర గురించి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఆమె పాత్ర ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండేది కదా అంటున్నారు.

ఆకాశంలో ఒక తార సినిమాలో రుహానీ శర్మ...

రుహాని కెరీర్‌ పరంగా ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుకోలేక పోతుంది. అప్పుడెప్పుడో చిలసౌ సినిమాతో తెలుగులో ఆకట్టుకున్న రుహాని ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసి మెప్పించింది. కానీ లక్‌ కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోయింది. గ్లామర్‌ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూ, ఒక హద్దు వరకు స్కిన్‌ షో చేయడం ఈమె ప్రత్యేకత అంటూ ఉంటారు. అలాంటి రుహాని శర్మ ఈ సినిమాలో మంచి పాత్రను దక్కించుకుంది. టాలీవుడ్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత ఒక ఛాన్స్ దక్కించుకున్న రుహానీ శర్మ వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుంది. ఆకట్టుకునే విధంగా నటించి మెప్పించింది.

రాజమౌళి, అల్లు అరవింద్‌ ప్రశంసలు...

రుహాని శర్మ యాక్టింగ్ గురించి అల్లు అరవింద్‌తో పాటు రాజమౌళి సైతం ప్రత్యేకంగా స్పందించారు, ఆమెను ప్రశంసించిన విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలోనూ ఆమె కనిపించిన కొన్ని విజువల్స్‌ను తీసుకుని షేర్‌ చేస్తున్నారు. సినిమా చూసిన వారు చాలా మంది సాత్విక వీరవల్లి తో పాటు రుహానీ శర్మకు సైతం మంచి మార్కులు దక్కాల్సిందే అంటున్నారు. ఉన్న కొద్ది నిమిషాలు ఆమె తనదైన ముద్ర వేయడంలో సక్సెస్ అయింది. సాధారనంగా సినిమాలో ఎక్కువ సమయం కనిపిస్తేనే పాజిటివ్‌ రెస్పాన్స్‌ను దక్కించుకోగలరు. కానీ ఈ సినిమాలో రుహానీ కొద్ది సమయం కనిపించినా కూడా మెయిన్‌ తారతో పాటు ఈ తార కూడా ఉందని గుర్తు పెట్టుకునేలా చేసింది. అందుకే ఆకాశంలో ఆ తార తో పాటు ఈ తార కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.