ఆకాశంలో ఒక తార.. మరో సీతారామం అయ్యేనా?
‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’తో తెలుగులో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వ్యోమగామి కావాలనుకునే పల్లెటూరి అమ్మాయి కలను కృష్ణ పాత్రలో దుల్కర్ నెరవేర్చే కథతో పవన్ సాదినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్వప్న దత్, అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ సాత్విక వీరవల్లికి కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
By: Ramesh Palla | 17 Nov 2026 8:00 AM ISTదుల్కర్ సల్మాన్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా సీతారామం సినిమా దుల్కర్ కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచి పోయింది అనడంలో సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులు సీతారామం సినిమాను, ఆ సినిమా పాటలను ఏ స్థాయిలో హిట్ చేశారో కూడా మనం చూశాం. సీతారామం సినిమా తర్వాత దుల్కర్ మళ్లీ ఆ స్థాయి ఎమోషన్స్ ఉన్న సినిమాను చేయాలని, అలాంటి డీసెంట్ లుక్, సింపుల్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకున్నారు. ప్రేక్షకుల కోరిక 'ఆకాశంలో ఒక తార' సినిమా తో నెరవేరబోతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ సినిమాను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఆకాశంలో ఒక తార సినిమాతో...
తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చూస్తే సినిమా మొత్తం కథ హీరోయిన్ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర ఏంటీ అనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఒక పల్లెటూరి అమ్మాయి వ్యోమగామి కావాలని కోరుకోవడం, అందుకు కృష్ణ అనే పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్ ఆ కలను నెరవేర్చేందుకు కష్టపడటంను ట్రైలర్‌లో చూపించారు. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని, అందుకు ఆమెకు సరైన మద్దతుగా ఒక మగ తోడు కావాలని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పెద్ద వారు సమర్పించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో అంచనాలు పెరిగాయి. స్వప్న దత్, అల్లు అరవింద్‌లు ఈ సినిమాను సమర్పించేందుకు, తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు.
దుల్కర్ సల్మాన్ హీరోగా...
ఈ సినిమాలో ఉన్న భావోద్వేగాలు నచ్చి, ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు అనే ఉద్దేశంతో, మంచి అవకాశం వదులుకోవద్దు అనే ఉద్దేశంతో సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా నిర్మాత స్వప్నదత్ అన్నారు. అంతే కాకుండా అల్లు అరవింద్ వంటి పెద్దలు ఈ సినిమా వెనుక నిలవడం వల్ల కూడా చాలా సంతోషంగా ఉందని, తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ను ఆమె వ్యక్తం చేసింది. ఈ సినిమాలో దుల్కర్ పాత్రను ఎక్కువగా చూపించడం లేదు. కానీ సినిమాలో ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని, ఆయన ఎమోషన్స్ తో ప్రేక్షకులను దర్శకుడు పవన్ సాదినేని కట్టిపడేస్తాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దుల్కర్ సల్మాన్ అభిమానులకు ఇది కచ్చితంగా చాలా పెద్ద సినిమాగా నిలుస్తుందని కూడా వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
రామ్ చరణ్ కు జోడీగా సాత్విక వీరవల్లి...
భారీ పోటీ మధ్య వస్తున్న ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ అభిమానులు సీతారామం సినిమాతో పోల్చుతున్నారు. ఆ సినిమాలో దుల్కర్ ను ఎలా అయితే చూశామో, ఈ సినిమాలోనూ అలాంటి ఇన్నోసెంట్ పాత్రలో చూడబోతున్నట్లుగా చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే అన్ని లక్షణాలు ఈ సినిమాకు ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. దుల్కర్ సల్మాన్ కు మాత్రమే కాకుండా ఈ సినిమా హీరోయిన్ సాత్విక వీరవల్లికి సైతం అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అయితే, ఆమెకు మంచి పేరు వస్తే రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా చరణ్ కు జోడీగా సాత్విక అనే ప్రచారం జరుగుతోంది. ఆకాశంలో ఒక తార ఫలితాన్ని బట్టి చరణ్ కు జోడీ హీరోయిన్ పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దుల్కర్ ఈ సినిమా హిట్ అయితే మరిన్ని తెలుగు సినిమాలు చేస్తాడని తెలుస్తోంది.
