ఆది సాయికుమార్ 'శంబాల' నెక్స్ట్ టార్గెట్ హిందీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ఆది సాయికుమార్ కెరీర్ లో 'శంబాల' చాలా స్పెషల్ మూవీగా నిలిచేలా ఉంది. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
By: M Prashanth | 27 Dec 2025 6:11 PM ISTఆది సాయికుమార్ కెరీర్ లో 'శంబాల' చాలా స్పెషల్ మూవీగా నిలిచేలా ఉంది. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిస్టిక్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ ఆదరణ చూస్తుంటే ఆదికి ఈసారి గట్టి హిట్ తగిలినట్టే కనిపిస్తోంది.
బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా తన సత్తా చాటుతోంది.
ప్రీమియర్లు, తొలి రెండు రోజుల వసూళ్లు కలుపుకుని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 5.4 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆది సాయికుమార్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి. మౌత్ టాక్ బాగుండటంతో రోజురోజుకూ కలెక్షన్స్ గ్రాఫ్ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది.
తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాను ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులకు కూడా చూపించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీన 'శంబాల'ను హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు హిందీ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు ప్రస్తుతం తుది దశలో ఉన్నట్లు సమాచారం.
నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. హిందీలో ఈ మధ్య కాలంలో ఇలాంటి డివోషనల్ మిస్టిక్ థ్రిల్లర్స్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. కాంతార, కార్తికేయ 2 లాంటి సినిమాలు అక్కడ అద్భుతాలు సృష్టించాయి. ఇప్పుడు 'శంబాల' కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఈ సినిమా ఇంతలా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం దర్శకుడు యుగంధర్ ముని టేకింగ్ అని ఆడియెన్స్ అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా, ఒక కొత్త పాయింట్ ని టచ్ చేస్తూ ఆయన కథ నడిపిన తీరు బాగుంది. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి. ఆది మెచ్యూర్డ్ నటనకు టెక్నికల్ టీమ్ పనితనం తోడవ్వడంతో అవుట్ పుట్ క్వాలిటీగా వచ్చింది.
ప్రస్తుతం లాంగ్ వీకెండ్ నడుస్తుండటంతో థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు హిందీ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే ముంబైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతోంది. మొత్తానికి తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న 'శంబాల'.. ఇక బాలీవుడ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
