Begin typing your search above and press return to search.

కల్కి శంబాలతో సంబంధం.. డైరెక్టర్ ఏమన్నారంటే?

అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ ని కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. అలా సినిమాని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకుళ్లడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది.

By:  Madhu Reddy   |   4 Nov 2025 2:58 PM IST
కల్కి శంబాలతో సంబంధం.. డైరెక్టర్ ఏమన్నారంటే?
X

ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉండాలి అని పేరు తెచ్చుకున్న నటుడు సాయికుమార్.. ప్రస్తుతం సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈయన కొడుకు ఆది కూడా సినిమాల్లో హీరోగా పరిచయమయ్యారు. అలా మొదట్లో లవ్లీ, ప్రేమ కావాలి వంటి సినిమాలు చేసి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం కమర్షియల్, యాక్షన్ ఫిలిమ్స్ చేస్తూ యాక్షన్ హీరోగా మారిపోయారు. అయితే అలాంటి ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న తాజా మూవీ శంబాల.. యుగేందర్ ముని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది.కానీ ఈ సినిమాకి సంబంధించి దాదాపు 50 రోజుల ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ ని కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. అలా సినిమాని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకుళ్లడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శంబాల మూవీ యూనిట్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు.

ఈ ప్రెస్ మీట్ లో ప్రభాస్ నటించిన కల్కి 2898AD శంబాలకి తన సినిమా శంబాలకి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది..? నిజంగానే కల్కి సినిమాలోని శంబాలకి ఆది సాయికుమార్ శంబాలకి రిలేషన్ ఉందా ? అనేదాని గురించి క్లారిటీ ఇచ్చారు. మరి కల్కి 2898 AD సినిమాల్లోని శంబాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొనే శంబాల మూవీని చేశారా..? అనే ప్రశ్న ఎదురవగా ఈ ప్రశ్నకు చిత్ర యూనిట్ ఏ విధంగా క్లారిటీ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం..

శంబాల అనే పేరు వినగానే అందరికీ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి లోని నటి శోభన ఉండే శంబాల ప్రపంచమే గుర్తుకొస్తుంది.. దాంతో ఆది సాయికుమార్ నటించే శంబాలకి కల్కిలో చూసిన శంబాలకి మధ్య సంబంధం ఉంది అని చాలామంది అనుకుంతున్నారు. అయితే ఇదే ప్రశ్నని యాంకర్ కూడా డైరెక్టర్ ను అడగగా.. "కల్కి మూవీలో చూపించిన శంబాలకి , ఈ శంబాలకి అస్సలు పొంతన లేదు. ఓన్లీ కాన్సెప్ట్ పరంగా పేరు మాత్రమే సేమ్ ఉంది. కానీ ఆ స్టోరీ ఈ స్టోరీ పూర్తిగా డిఫరెంట్..కల్కి సినిమా మైథాలాజికల్ గా పురాణాల్లో ఏం జరిగింది అనేది చూపించారు.కానీ మా శంబాల మూవీలో కాన్సెప్ట్ పూర్తిగా వేరే ఉంటుంది.

దీన్ని థియేటర్లో చూసినప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే హిమాలయాల్లో శంబాల ఉన్నదని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ అది ఉందో లేదో ఎవరికి తెలియదు. కానీ ఎక్కువ మంది మాత్రం శంబాల ఉందనే నమ్ముతారు. ఇక కల్కి సినిమాలో శంబాల పేరు వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. కల్కి సినిమా గురించి తెలియడం కంటే ముందే నేను నా స్టోరీ రాసుకున్నాను. దానికి శంబాల అని పేరు కూడా పెట్టుకొని మా ప్రొడ్యూసర్లకు కూడా చెప్పాను. ఆ తర్వాత కల్కిలో శంబాల చూసి చాలా సంతోషించాను. ఎందుకంటే అంతకు ముందు శంబాల అనే పేరు చెప్తే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ కల్కి మూవీలో శంబాల చూపించేరికి శంబాల అనే పేరుకి ఎక్కువ క్రేజ్ పెరిగింది. దానివల్ల నా సినిమాకి కూడా ప్లస్. ఫైనల్ గా కల్కి మూవీకి ఈ సినిమాకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమా కల్కి సినిమాకి పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది.ఇది మరొక వరల్డ్ అంటూ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

అలా దర్శకుడి క్లారిటీతో కల్కి సినిమాలోని శంబాలకి ఆది సాయికుమార్ నటించే శంబాలకి మధ్య ఎలాంటి సంబంధం లేదని అర్థమైపోయింది. కానీ కల్కి శంబాలతో ఆది సాయికుమార్ శంబాలకి కూడా మంచి బజ్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు..

ఈ సినిమా విషయానికి వస్తే.. యుగేందర్ ముని డైరెక్టర్ గా ఆది సాయికుమార్ , అర్చన హీరో హీరోయిన్లుగా నటించగా స్వసికా విజయ్, రవివర్మ, ఇంద్రనీల్, మధునందన్, హర్షవర్ధన్ లు కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీ ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్,మహీధర్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.