Begin typing your search above and press return to search.

సినిమా విడుదలకు ముందే లాభాలు తెచ్చి పెట్టిన శంబాల..!

వెర్సటైల్ నటుడు ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   17 Dec 2025 3:44 PM IST
సినిమా విడుదలకు ముందే లాభాలు తెచ్చి పెట్టిన శంబాల..!
X

వెర్సటైల్ నటుడు ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు.. మహీధర్ రెడ్డి నిర్మించారు. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కొత్త కాన్సెప్ట్‌తో రూపొందింది. సూపర్ నేచురల్ అంశాలు.. థ్రిల్లింగ్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతున్నాయి అని వినికిడి.




ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్.. వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. సోషల్ మీడియాలో ఈ కంటెంట్ వైరల్ అవడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.

ఈ క్రమంలో శంబాల సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. మంచి క్రేజ్ ఉండటంతో మేకర్స్ ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్లకే అమ్మేశారంట. నైజాం ఏరియాలో మైత్రి సంస్థ, ఏపీ.. సీడెడ్ ప్రాంతాల్లో ఉషా పిక్చర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటకలో కూడా మంచి స్థాయిలో రిలీజ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంకా సినిమా విడుదలకు ముందే ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడవడం విశేషం. దీంతో నిర్మాతలు ముందుగానే లాభాల్లోకి రావడం ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఇది సినిమాపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది.

నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. విజువల్స్ పరంగా సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ కె బంగారి అందించిన కెమెరా వర్క్, శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘శంబాల’ను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వనుందనే నమ్మకం మేకర్స్‌లో కనిపిస్తోంది.