శంభాల: విడుదలకు ముందే అదిరిపోయే బిజినెస్
సరిగ్గా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ సినిమా విషయంలో ఇదే జరిగింది. విడుదలకు ఇంకా నెల రోజులు ఉండగానే, శంభాల సినిమా టేబుల్ ప్రాఫిట్ దిశగా అడుగులు వేస్తోంది.
By: M Prashanth | 24 Nov 2025 12:54 PM ISTఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు.. కాసుల వర్షం కురుస్తుందని మరోసారి రుజువైంది. హీరో గత సినిమాలు హిట్టయ్యాయా అన్నది పక్కన పెడితే.. కథలో దమ్ముంటే బిజినెస్ దానంతట అదే జరుగుతుంది. సరిగ్గా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ సినిమా విషయంలో ఇదే జరిగింది. విడుదలకు ఇంకా నెల రోజులు ఉండగానే, శంభాల సినిమా టేబుల్ ప్రాఫిట్ దిశగా అడుగులు వేస్తోంది.
ఈమధ్య కాలంలో నాన్ థియేట్రికల్ రూట్లో సినిమాలకు అంతగా బిజినెస్ కలిసి రావడం లేదు. కానీ శంభాల సినిమా కాన్సెప్ట్, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో సీన్ మొత్తం మారిపోయింది. మేకర్స్ ఊహించని రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. థియేటర్లో రిలీజ్ కాకముందే డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో నిర్మాతల జేబులు నిండాయి.
ఆది సాయికుమార్ సరికొత్త రోల్ లో నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ 'శంభాల' ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. కేవలం టీజర్, ట్రైలర్ చూసే ఈ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక బుల్లితెర విషయానికి వస్తే, ప్రముఖ ఛానల్ 'జీ తెలుగు' ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. రిలీజ్ కు ముందే ఇలా రెండు మెయిన్ డీల్స్ క్లియర్ అవ్వడం సినిమాపై ఉన్న క్రేజ్ ను చూపిస్తోంది.
అసలు ఈ రేంజ్ డిమాండ్ రావడానికి ప్రధాన కారణం ఇందులోని కథాంశం. 1980ల నాటి పల్లెటూరు, ఉల్కాపాతం, శివుడు, అసురుడి మధ్య యుద్ధం అనే బ్యాక్‌డ్రాప్ బయ్యర్లను బాగా ఆకర్షించింది. ట్రైలర్ లో సాయికుమార్ వాయిస్ ఓవర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. సైన్స్ కు, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధం కాబట్టి ఆడియన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతారని ఓటీటీ, టీవీ ఛానళ్లు నమ్ముతున్నాయి.
యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉండబోతోంది. ఆది సాయికుమార్ ఇందులో జియాలజిస్ట్ గా చేస్తుండగా, అర్చన అయ్యర్, స్వాసిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ వైపు గ్రాఫిక్స్, మరోవైపు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వస్తున్న ఈ సినిమాను 'ఆహా' చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు టాక్.
బిజినెస్ పరంగా ఇప్పటికే సక్సెస్ కొట్టిన 'శంభాల', బాక్సాఫీస్ దగ్గర కూడా అదే జోరు చూపిస్తుందేమో చూడాలి. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఇక పవర్ఫుల్ హిట్టు కోసం చూస్తున్న ఆదికి.. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది.
