ఆది 'శంబాల'.. కథ చెప్పడం వెనుక ప్లాన్ ఇదేనా?
అయితే సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అవ్వగా.. మూవీ టీమ్ దాన్ని పెంచుకుంటూ పోతుంది. ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది.
By: M Prashanth | 19 Dec 2025 11:19 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. సినిమా, సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకున్న ఆది.. స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు శంబాల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి సందడి చేయనున్నారు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన శంబాల: ఏ మిస్టరీ వరల్డ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన థియేటర్స్ లో రానుంది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఆ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. అర్చన అయ్యర్, స్వస్తిక, రవి వర్మ, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు.
అయితే సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అవ్వగా.. మూవీ టీమ్ దాన్ని పెంచుకుంటూ పోతుంది. ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. ఇప్పుడు ప్రమోషన్స్ లో హీరో ఆది ఏకంగా శంబాల మూవీ స్టోరీని రివీల్ చేశారు. నార్మల్ గా ఏ సినిమా కథ అయినా రిలీజ్ కు ముందు ఎవరూ మేకర్స్ స్టోరీని రివీల్ చేయరు. జస్ట్ హింట్స్ మాత్రమే ఇస్తారు.
స్టోరీ ముందే తెలిస్తే థ్రిల్ ఉండదేమోనని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆది సాయి కుమార్.. శంబాల విషయంలో భిన్నంగా ఆలోచించారు. ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. సినిమాలో హీరో సైంటిస్ట్ కాగా.. ఒక ఊరిలో ఆస్టరాయిడ్ పడడంతో అక్కడికి వెళ్తాడని చెప్పారు. కానీ గ్రామంలో మూఢ నమ్మకాలను ఎక్కువ నమ్ముతారని తెలిపారు.
అందుకే దాన్ని దుష్టశక్తి అని అంతా అనుకోగా.. అప్పుడు హీరో ఏం చేశాడన్నది సినిమా అని ఆది తెలిపారు. ఆస్టరాయిడ్ ఏంటనేది తేల్చడమే సినిమా కాగా.. ఇప్పటికే అలాంటి చిత్రాలు వచ్చినట్లు కూడా చెప్పారు. కానీ తన సినిమాలో ఎన్నో కొత్త విషయాలు ఉంటాయని, మొత్తం ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని ఆది వెల్లడించారు.
మూవీ స్క్రీన్ ప్లే ఆధారంగా సాగుతుందని.. సినిమా అంతా ఆసక్తి రేపుతూనే ఉంటుందని చెప్పారు. అలా శంబాల స్టోరీపై క్లారిటీ ఇచ్చారు ఆది. అయితే ఇప్పటికే మూవీపై అంచనాలు ఉండగా.. ఇప్పుడు స్టోరీ లైన్ చెప్పి ఇంకా వాటిని పెంచడమే ఆది సాయికుమార్ ప్లాన్ గా తెలుస్తోంది. మరి వచ్చే వారం విడుదల అవ్వనున్న శంబాల మూవీ ఎలా ఉండనుందో.. యంగ్ హీరో ఎలాంటి విజయం అందుకుంటారో అంతా వేచి చూడాలి.
