చంద్రహాస్.. ఒక టైగర్ ష్రాఫ్ లా అనిపించాడు
వేదికపై ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రభాకర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో నెక్స్ట్ నువ్వే అనే సినిమా చేశారు.
By: M Prashanth | 2 Feb 2026 10:53 AM ISTప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా. సంపద్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ హీరో ఆది సాయికుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వేదికపై ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రభాకర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో నెక్స్ట్ నువ్వే అనే సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాకర్ తనకి చంద్రహాస్ కి సంబంధించిన వీడియోలు చూపించేవారని ఆది చెప్పారు. గోడల మీద నుంచి దూకడం, బ్యాక్ ఫ్లిప్స్ చేయడం వంటి సాహసాలు చూసి అప్పట్లోనే తను ఆశ్చర్యపోయానని ఆది తెలిపారు.
చంద్రహాస్ టాలెంట్ గురించి చెప్తూ.. తనని చూస్తుంటే ఒక టైగర్ ష్రాఫ్ లా అనిపించిందని ఆది ప్రశంసించారు. తాను కూడా చిన్నప్పుడు పానియన్ మాస్టర్ దగ్గర జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నానని, చంద్రహాస్ చేస్తున్న స్టంట్స్ చూస్తే ఆ రోజులు గుర్తొచ్చాయని అన్నారు. ప్రభాకర్ అన్నకి అప్పుడే చెప్పాను.. మీ అబ్బాయి తప్పకుండా ఒక మంచి హీరో అవుతాడని, ఇప్పుడు ఆ జర్నీ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
చంద్రహాస్ పడుతున్న కష్టాన్ని తాను దగ్గర నుండి చూస్తున్నానని, తను వంద శాతం ఎఫర్ట్స్ పెట్టి చాలా హానెస్ట్ గా పని చేస్తున్నాడని ఆది కొనియాడారు. ఈ బరాబర్ ప్రేమిస్తా సినిమాతో చంద్రహాస్ కి ఒక మంచి బ్రేక్ రావాలని, తను ఒక పెద్ద హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమా సాంగ్స్ ఇప్పటికే చాలా బాగున్నాయని, మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ వర్క్ ని మెచ్చుకున్నారు.
హీరోయిన్ మేఘనా ముఖర్జీ గురించి మాట్లాడుతూ.. తను మిస్ ఇండియా అని తెలిసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే డైరెక్టర్ సంపద్, ప్రొడ్యూసర్స్ చందు, చిన్నిలకు కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని విషెస్ తెలిపారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుందని, ఆడియన్స్ అందరూ థియేటర్లకి వచ్చి సినిమా చూసి ఈ టీమ్ ని ప్రోత్సహించాలని ఆది సాయికుమార్ రిక్వెస్ట్ చేశారు. చివరగా ప్రభాకర్ గారితో ఉన్న స్నేహం గురించి సరదాగా మాట్లాడుతూ.. మళ్ళీ ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని, తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏషియన్ సినిమాస్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటం సినిమా రేంజ్ ని పెంచిందని అభిప్రాయపడ్డారు.
