Begin typing your search above and press return to search.

'శంబాల' ఆది డెడికేషన్.. తీవ్రంగా గాయపడినా తగ్గేదేలే..

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   18 Dec 2025 5:51 PM IST
శంబాల ఆది డెడికేషన్.. తీవ్రంగా గాయపడినా  తగ్గేదేలే..
X

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆది.. ఇప్పుడు సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన శంబాలతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీ నుంచి థియేటర్స్ లో సందడి చేయనున్నారు.

ఇప్పటికే ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ కచ్చితంగా క్లిక్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. టాలీవుడ్‌ లో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉండగా.. అదే కోవలోకి శంబాల వస్తుందని మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది.

శంబాల మూవీ మంచి విజువల్ వండర్ గా సందడి చేయనున్నట్లు తెలుస్తుండగా.. అందుకు మేకర్స్ బాగా కష్టపడినట్లు సమాచారం. సినిమాలోని యాక్షన్ సీన్స్ ను అత్యంత సహజంగా, భారీ స్థాయిలో తెరకెక్కించారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అవి కచ్చితంగా సినీ ప్రియులను అబ్బురపరుస్తాయనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

అయితే యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా హీరో ఆది గాయపడ్డారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ లో భాగంగా ఒక కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ను రాత్రి సమయంలో చిత్రీకరించారు. ఆ సమయంలో చాలా మంది నటీనటులు పాల్గొన్న భారీ ఫైట్ సీన్‌ లో ప్రమాదవశాత్తు ఆదికి సెట్స్ లో తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడినా కూడా ఆది.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారట. ఆ గాయాలతోనే వెనక్కి తగ్గకుండా షూటింగ్ చేసి తన డెడికేషన్ ను చూపించుకున్నారు. సాధారణంగా అలా గాయపడిన సమయంలో ఎవరైనా వెంటనే బ్రేక్ తీసుకుంటారు, కానీ ఆది మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని చెప్పాలి.

ఎందుకంటే ముందు నుంచే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కు ఇబ్బంది కలగకుండా.. నిర్మాతలకు నష్టం కలగకుండా.. షూటింగ్ కు బ్రేక్ పడకుండా.. మూవీ టీమ్ కష్టమంతా వేస్ట్ అవ్వకుండా చూసుకున్నారు ఆది. గాయాలు ఇబ్బంది పెడుతున్నా.. ఆయన ఇబ్బంది పడుతున్నా.. రాత్రంతా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ రోజు షెడ్యూల్ ను అలానే పూర్తి చేశారు. ఇప్పుడు ఆ విషయం నెట్టింట వైరల్ గా మారగా.. ఆదిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక శంబాల విషయానికొస్తే.. యగంధర్ ముని దర్శకత్వం వహించగా, షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌ పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఆంధ్రప్రదేశ్, సీడెడ్‌ ఏరియాల్లో ఉషా పిక్చర్స్, ఓవర్సీస్ లో మూన్ షైన్ మూవీస్, కర్ణాటకలో కుమార్ బెంగళూరు ఫిల్మ్స్ డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నాయి. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.