Begin typing your search above and press return to search.

'శంబాల'.. అదే సినిమాకు నెక్స్ట్ లెవెల్: ఆది సాయికుమార్

ఫైనల్ గా.. పురాణాల్లోని 'శంబాల', కల్కి సినిమా ట్రెండ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని ఆది అభిప్రాయపడ్డారు.

By:  M Prashanth   |   23 Dec 2025 11:34 PM IST
శంబాల.. అదే సినిమాకు నెక్స్ట్ లెవెల్: ఆది సాయికుమార్
X

యుగంధర్ ముని దర్శకత్వంలో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ 'శంబాల' డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమైంది. తన పుట్టినరోజు సందర్భంగా ఆది మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. టీజర్, ట్రైలర్లకు వచ్చిన రెస్పాన్స్, దుల్కర్ సల్మాన్, ప్రభాస్, నాని వంటి స్టార్స్ సపోర్ట్ వల్ల సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యిందని, ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

80వ దశకం నాటి కథ కావడంతో లుక్స్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సినిమాలో పాటల గురించి ఆది ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ చిత్రంలో సాంగ్స్ ఎక్కువగా ఉండవని, అసలైతే ఒక ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేశాం కానీ టైమ్ సరిపోలేదని వివరించారు. పైగా ఇలాంటి సీరియస్ జానర్ సినిమాలకు హుక్ స్టెప్స్, కమర్షియల్ సాంగ్స్ పెద్దగా సెట్ అవ్వవని క్లారిటీ ఇచ్చారు.

అందుకే శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టామని, ఆ ఆర్ఆర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిందని స్పష్టం చేశారు. షూటింగ్ విశేషాలు చెబుతూ.. అరకులో విపరీతమైన చలిలో నైట్ షూట్స్ చేశామని, ఒక ఫైర్ సీక్వెన్స్ లో తనకు చిన్న గాయం కూడా అయ్యిందని ఆది గుర్తుచేసుకున్నారు. ఇక హీరోయిన్ అర్చన పాత్ర తనతో పాటే ట్రావెల్ అవుతుందని, ఆ పాత్ర అందరికీ నచ్చుతుందని తెలిపారు.

దర్శకుడు యుగంధర్ కు సినిమా పట్ల ఉన్న ప్యాషన్, ఆయన మొదటి సినిమా అంటే తనకెంతో ఇష్టమని ఆది ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నిర్మాతలు కూడా తన మార్కెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టారని, అవుట్ పుట్ విషయంలో రాజీపడలేదని అన్నారు. డిసెంబర్ 25న గట్టి పోటీ ఉన్నప్పటికీ, ఇది సినిమాలకు మంచి సీజన్ అని, ఈ డేట్ మిస్ చేసుకోకూడదనే ప్రీమియర్స్ తో వస్తున్నామని ఆది తెలిపారు.

శ్రీకాంత్ గారి ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ వల్ల, రోషన్ నటించిన 'ఛాంపియన్' కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. హిందీలో కూడా 'శంబాల' రిలీజ్ ప్లాన్స్ ఉన్నాయని, ఇక్కడ టాక్ వచ్చాక అక్కడ ప్రమోషన్స్ మొదలుపెడతామని వెల్లడించారు.

ఫైనల్ గా.. పురాణాల్లోని 'శంబాల', కల్కి సినిమా ట్రెండ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని ఆది అభిప్రాయపడ్డారు.

తనకు పెద్దగా మూఢనమ్మకాలు లేకపోయినా ఇంట్లో సెంటిమెంట్స్ ఫాలో అవుతానని, ఈవెంట్ లో తన తల్లి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ చూసి తను కూడా షాక్ అయ్యానని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుత ఆడియెన్స్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోరుకుంటున్నారని, 'శంబాల' లాంటి చిత్రాలను థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ దక్కుతుందని అన్నారు. అలాగే ఆడియెన్స్ రెస్పాన్స్ ను బట్టి ఈ సినిమాకు పార్ట్ 2 ప్లాన్ చేస్తామని కూడా ఆది క్లారిటీ ఇచ్చాడు.