Begin typing your search above and press return to search.

ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న శంబాల‌

శంబాల స్ట్రీమింగ్ కు వ‌చ్చిన 10 రోజుల్లోనే 100 మిలియ‌న్ మినిట్స్ ను దాటి రికార్డు సృష్టించింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Feb 2026 12:01 AM IST
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న శంబాల‌
X

సీనియ‌ర్ హీరో, మ‌రియు ప్ర‌ముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆది. ప్రేమ కావాలి మూవీతో హీరోగా తెలుగు ఆడియ‌న్స్ కు ప‌రిచయ‌మైన ఆది సాయికుమార్, గ‌త కొంత కాలంగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ఆది స‌క్సెస్ రుచి చూసి చాలా కాల‌మవుతుంది.

శంబాల ఫ‌లితంతో ఆది కెరీర్ కు భారీ ఊర‌ట‌

కెరీర్లో స‌రైన ఫామ్ లో లేక ఇబ్బంది ప‌డుతున్న ఆది సాయికుమార్‌కి రీసెంట్ గా వ‌చ్చిన శంబాల సినిమా ఫలితం ఎంతో ఊర‌ట‌నిచ్చింది. త‌న కెరీర్లో ప‌లు ప్ర‌యోగాలు చేసిన ఆది, శంబాల మూవీతో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ జాన‌ర్ ను ప్ర‌య‌త్నించారు. అయితే ఈసారి ఆది చేసిన ప్ర‌యోగం ఊరికే పోలేదు. ఈ సినిమాతో ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేయ‌డంలో ఆది నూటికి నూరు శాతం స‌క్సెస్ అయ్యారు.

ఆది కెరీర్లోనే పెద్ద హిట్

గతేడాది డిసెంబ‌ర్ ఆఖ‌రి వారంలో రిలీజైన ఈ సినిమా అంద‌రి అంచ‌నాల‌ను మించి స‌క్సెస్ ను అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ.25 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన ఈ మూవీ ఆది కెరీర్లోనే బిగ్గెస్ట్ స‌క్సెస్ గా నిలిచింది. థియేట‌ర్ల‌లో స‌క్సెస్ త‌ర్వాత రీసెంట్ గా జ‌న‌వ‌రి 22న శంబాల ఓటీటీలోకి వ‌చ్చింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో శంబాల స్ట్రీమింగ్ కు వ‌చ్చి, ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.

శంబాల స్ట్రీమింగ్ కు వ‌చ్చిన 10 రోజుల్లోనే 100 మిలియ‌న్ మినిట్స్ ను దాటి రికార్డు సృష్టించింది. దీంతో శంబాల బాక్సాఫీస్ వ‌ద్ద మాత్ర‌మే కాకుండా ఓటీటీలోనూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ద‌క్కిన‌ట్టు అయింది. అయితే ఈ మధ్య కొన్ని హిట్ సినిమాలకు కూడా ఓటీటీలో అనుకున్న రెస్పాన్స్ రాని నేప‌థ్యంలో శంబాల సినిమా మంచి వ్యూస్ ను అందుకోవ‌డం విశేషం. మిస్ట‌రీ, థ్రిల్ల‌ర్ స్టోరీల‌కు ఓటీటీ ఆడియ‌న్స్ ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతుండ‌టం కూడా శంబాల‌కు కలిసొచ్చే అంశమ‌ని కొంద‌రు భావిస్తున్నారు.

హిందీ వెర్ష‌న్ రిలీజ్ కు స‌న్నాహాలు

యుగంధ‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో అర్చ‌న అయ్య‌ర్ హీరోయిన్ గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే శంబాల హిందీ వెర్ష‌న్ రిలీజ్ కు కూడా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీ హిందీలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానున్న‌ట్టు స‌మాచారం. ఆల్రెడీ తెలుగు వెర్ష‌న్ లోనే భారీ వ్యూస్ ను అందుకున్న శంబాల‌, హిందీ రిలీజ్ త‌ర్వాత ఇంకా ఎక్కువ వ్యూస్ వ‌చ్చే అవ‌కాశముంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు.