Begin typing your search above and press return to search.

ఆది ఖాతాలో మ‌రో భారీ ప్రాజెక్టు?

అతను పెళ్లి చేసుకోవడానికి ఒక గంట ముందు నేను చాలా భయపడ్డాను. నా గుండె దడదడలాడింది. అతను ఈ నోట్ తో నా దగ్గరకు వచ్చినప్పుడు.. ఆ క్షణం అంతా ప్రశాంతంగా, హాయిగా అనిపించింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 Aug 2025 4:00 AM IST
ఆది ఖాతాలో మ‌రో భారీ ప్రాజెక్టు?
X

టాలీవుడ్ టాలెంటెడ్ న‌టుడు ఆది పినిశెట్టి గురించి సౌత్ ఆడియ‌న్స్ కు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టి కొడుకుగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది, త‌క్కువ టైమ్ లోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ఎన్నో ప్ర‌యోగాలు చేస్తూ వ‌చ్చిన ఆది రీసెంట్ గా మ‌య‌స‌భ వెబ్ సిరీస్ లో క‌నిపించి ఆడియ‌న్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నారు.

అఖండ‌2లో విల‌న్‌గా ఆది పినిశెట్టి

ఇప్ప‌టికే న‌టుడిగా త‌న స‌త్తా ఏంటో ప్రూవ్ చేసుకున్న ఆది పినిశెట్టి ఇప్పుడు భారీ బ‌డ్జెట్ సినిమాల‌పై ఫోక‌స్ చేశారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే అఖండ2 తాండ‌వం ను చేస్తున్నారు ఆది. బాల‌య్య‌- బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న అఖండ‌2 లో ఆది విల‌న్ గా న‌టిస్తున్నారు. ఇప్పుడు అఖండ‌2తో పాటూ ఆది మ‌రో బిగ్ బ‌డ్జెట్ సినిమాలో అవ‌కాశం అందుకున్న‌ట్టు తెలుస్తోంది.

కార్తీ సినిమాలో ఆది

అయితే ఈ సారి ఆది న‌టిస్తోంది తెలుగు సినిమాలో కాదు. కార్తీ హీరోగా త‌మిజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మార్ష‌ల్ అనే సినిమాలో. వాస్త‌వానికి ఆది ఇప్పుడు న‌టించ‌నున్న క్యారెక్ట‌ర్ కోసం గ‌తంలో న‌వీన్ పౌలీని అనుకున్నారు. అయితే మార్ష‌ల్ లో ఆది చేయ‌బోయే క్యారెక్ట‌ర్‌కు నెగిటివ్ షేడ్స్ ఉంటాయ‌ని, సినిమాలో ఆది చేయ‌బోయే క్యారెక్ట‌ర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంద‌ని స‌మాచారం.

మార్ష‌ల్ లో నాని స్పెష‌ల్ రోల్

ఈ సినిమాలో ఆదితో పాటూ ప‌లువురు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన న‌టులు కూడా న‌టించ‌నుండ‌గా క‌ళ్యాణి ప్రియద‌ర్శ‌న్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇదే సినిమాలో టాలీవుడ్ నేచుర‌ల్ స్టార్ నాని కూడా ఓ స్పెష‌ల్ రోల్ లో క‌నిపిస్తారంటున్నారు కానీ దీనిపై ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.