Begin typing your search above and press return to search.

వెంకీ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ ఎలా ఉందంటే?

ట్రైలర్‌ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొనే కష్టాలను చూపించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల మధ్య సాగే కుటుంబం జీవితంలో అనుకోని ఛేంజెస్ చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది.

By:  M Prashanth   |   23 Oct 2026 9:04 PM IST
వెంకీ ఆదర్శ కుటుంబం.. ట్రైలర్ ఎలా ఉందంటే?
X

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌ లో సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి. అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ కు యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోడైతే ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 మూవీ ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటోంది. వెంకీ మార్క్ కామెడీ, త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, కుటుంబ భావోద్వేగాలు ట్రైలర్‌ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

నిజానికి వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో దాదాపు 20 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా ఇది. దీంతో ఆ మూవీపై మొదటి నుంచే హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. అక్టోబర్ 23న హైదరాబాద్‌ లో జరిగిన ఈవెంట్ లో మూవీ టీమ్ ట్రైలర్‌ ను విడుదల చేసింది.

ట్రైలర్‌ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొనే కష్టాలను చూపించారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల మధ్య సాగే కుటుంబం జీవితంలో అనుకోని ఛేంజెస్ చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా సాగే ఫ్యామిలీ స్టోరీలోనే ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఆ ఛేంజెస్ వెనుక అసలు కారణం ఏంటి, ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది స్క్రీన్ పై చూడాల్సిందే.

ఇక వెంకటేశ్ తనదైన కామెడీతో మరోసారి ఆకట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సన్నివేశాలు, ఆయన చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. అదే సమయంలో కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే వ్యక్తిగా కూడా కనిపిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో వెంకీ స్పీడ్ కొత్తగా అనిపిస్తోంది. ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఈసారి ఎంటర్టైన్మెంట్ తోపాటు యాక్షన్‌ ను కూడా కలిపి చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్ కు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ సినిమాలోనూ ఆయన రాసిన డైలాగ్స్ ట్రైలర్‌ లో ఆకట్టుకుంటున్నాయి. సరదా మాటలతో నవ్వించడం, అవసరమైన చోట ఆలోచింపజేసేలా మాట్లాడించడం ద్వారా ఆయన స్టైల్ కనిపిస్తోంది. ఫ్యామిలీ స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కూడా ఇంట్రెస్ట్ పెంచుతోంది. దీంతో సినిమా కేవలం ఇంటి సమస్యలు, ఫ్యామిలీ రిలేషన్స్ కు పరిమితం కాకుండా సస్సెన్స్ కూడా పంచేలా కనిపిస్తోంది.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ కు మంచి స్త్రెంత్ ఇచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ట్రైలర్‌ లో కనిపించిన అన్ని ఎలిమెంట్స్ సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా మూవీ థియేటర్లలో విడుదల కానుంది.